Hyderabad Rape: బంజారాహిల్స్ దారుణం... యువతిపై వంటమనిషి అత్యాచారం

Published : Sep 30, 2021, 10:49 AM IST
Hyderabad Rape: బంజారాహిల్స్ దారుణం... యువతిపై వంటమనిషి అత్యాచారం

సారాంశం

 ఓ ఖరీదైన విల్లాలో పనిచేసే మహిళపై అక్కడే వంటమనిషిగా పనిచేసే వ్యక్తి అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడిన దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ (Hyderabad): ఒకే దగ్గర పనిచేస్తున్నాం కదా అని అతడితో కాస్త చనువుగా మెలిగింది. దీన్ని అదునుగా తీసుకుని ఆమెపై కన్నేసిన దుర్మార్గుడు అతి దారుణంగా అత్యాచారానికి (Sexual Attack) పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్12లోని ఓ విలాసవంతమైన విల్లాలో ఓ మహిళ పనిచేస్తోంది. అదే విల్లాలో శివ అనే వ్యక్తి కూడా వంటమనిషిగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఒకేచోట పనిచేస్తుండటంతో కాస్త చనువుగా వుండేవారు.  

read more  Nizambad gang Rape: ముగ్గురు అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు

అయితే మహిళ చనువుగా వుండడాన్ని అదునుగా తీసుకున్న శివ దారుణానికి పాల్పడ్డాడు. మహిళ ఒంటరిగా వున్న సమయంలో ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు శివ. దీంతో బాధిత మహిళ తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్