Asianet News TeluguAsianet News Telugu

Nizambad gang Rape: ముగ్గురు అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు


నిజామాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బర్త్ డే పార్టీ కోసం వచ్చిన యువతిపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Nizambad gang Rape: police arrested three in gang rape case
Author
Nizamabad, First Published Sep 30, 2021, 9:38 AM IST

నిజామాబాద్: నిజామాబాద్‌ (nizambad gang rape)జిల్లా కేంద్రంలో విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురిని (three )పోలీసులు అరెస్ట్ (arrest)చేశారు. మరో  ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఫేస్‌బుక్‌లో (face book)పరిచయమైన యువకుడితో యువతికి మధ్య స్నేహం ఏర్పడింది. మంగళవారం నాడు తన బర్త్‌డే సందర్భంగా యువతిని ఆ వ్యక్తి పిలిచాడు.ఈ బర్త్‌డే పార్టీలో యువతి పాల్గొంది. ఆర్మూర్ నుండి నిజామాబాద్ కు వచ్చిన యువతి ఆ విందులో పాల్గొంది. ఆర్మూర్ కు(armoor) తిరిగి వెళ్లే సమయంలో యువతిని ఆ యువకుడు బస్టాండ్ కు సమీపంలోని తన స్నేహితుడు ఉన్న ఆసుపత్రికి తీసుకొచ్చాడు. 

also read:నిజామాబాద్ లో యువతిపై గ్యాంగ్ రేప్.. ఆస్పత్రి గదిలో మద్యం తాగించి...

అక్కడే యువతికి కూల్‌డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. యువతి స్నేహితుడితో పాటు మరో ఇద్దరు కూడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరో ఇద్దరు నిందితులకు సహకరించారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రి వద్ద సెక్యూరిటీ గార్డులు అపస్మారకస్థితిలో ఉన్న యువతిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలించారు. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.  యువతిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios