మంచిదొంగ : ‘సారీ బాబాయ్.. కాస్త అవసరం ఉండి బైక్ తీసుకెళ్లా.. ఏమీ అనుకోవద్దు..’

Published : Sep 30, 2021, 10:12 AM IST
మంచిదొంగ : ‘సారీ బాబాయ్.. కాస్త అవసరం ఉండి బైక్ తీసుకెళ్లా.. ఏమీ అనుకోవద్దు..’

సారాంశం

మోత్కూరులో బుధవారం ఇలాంటి ఘటనే జరిగింది. ఆ వివరాల్లోకి వెడితే.. రామన్నపేట మండలం సూరారం గ్రామానికి చెందిన బొంత నర్సింహా మంగళవారం మోత్కూరులోని ఓ ఆస్పత్రికి వచ్చాడు. స్థానికంగా ఉన్న ఓ మద్యం దుకాణం ఎదుట టూ వీలర్ ను ఆపాడు.

తెలంగాణ(telangana)లో ఓ విచిత్రం జరిగింది. అతను దొంగే.. కానీ మంచిదొంగ(good thief).. ఇలాంటి వారు అక్కడక్కడా.. అప్పుడప్పుడూ తగులుతుంటారు. వీళ్లు నిజానికి దొంగతనం (thieft) చేయాలనుకోరు. అవసరానికి దొంగతనం చేస్తారు. ఆ అవసరం తీరాక దొంగతనం చేసిన వస్తువులను ఎక్కడివి అక్కడే పెట్టి వెళ్లిపోతారు. అలాంటి ఓ మంచి దొంగ కథే.. ఇది..

మోత్కూరులో బుధవారం ఇలాంటి ఘటనే జరిగింది. ఆ వివరాల్లోకి వెడితే.. రామన్నపేట మండలం సూరారం గ్రామానికి చెందిన బొంత నర్సింహా మంగళవారం మోత్కూరులోని ఓ ఆస్పత్రికి వచ్చాడు. స్థానికంగా ఉన్న ఓ మద్యం దుకాణం ఎదుట టూ వీలర్ ను ఆపాడు.

Nizambad gang Rape: ముగ్గురు అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు

కాసేపటికి వచ్చి చూస్తే తన వెహికిల్ కనిపించలేదు. వెంటనే అతను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బుధవారం మళ్లీ మోత్కూరు వచ్చి మద్యం దుకాణం ముందు నుండి వెడుతుండగా.. తన వాహనం కనిపించింది. అంతేకాదు.. దానిమీద ఓ చీటీ కూడా కనిపించింది. 

దానిమీద ‘సారీ బాబాయ్ ఏమీ అనుకోవద్దు. డబ్బులు అవసరం ఉండి నీ బండి తీసుకుని ఇంటికి వెళ్లాను’ అని రాసి ఉంది. ఆ చీటీని చూసిన సదరు యజమాని కాస్త ఆశ్చర్యానికి గురయ్యాడు. టూవీలర్ దొరికిన సమాచారం పోలీసులకు అందించాడు. దీంతో వారు వచ్చి వాహనాన్ని, నర్సింహను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. కథ సుఖాతమయ్యింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్