
హైదరాబాద్: hyderabad నగరంలోని Rajendra Nagar లో రోడ్డు పక్కన నడుచుకొంటూ వెళ్తున్న యువతిని Car ఢీకొట్టి వెళ్లింది.ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. పొరపాటును కారుతో యువతిని ఢీకొట్టారా లేదా ఉద్దేశ్యపూర్వకంగా కారుతో యువతిని ఢీకొట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారును రివర్స్ తీసుకెళ్లి మరీ ఢీ కొట్టినట్టుగా CCTV పుటేజీలో దృశ్యాలు ఉన్నట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
యువతిని ఢీకొట్టేందుకు కారును రివర్స్ తీసుకెళ్లారా లేదా మరే ఇతర కారణాలున్నాయా అనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి కుటుంబ సభ్యలను ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎవరితోనైనా వివాదాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. మరో వైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.