పటాన్ చెరు సమీపంలో కోడి పందేలు, 21మంది అరెస్ట్...పరారీలో ఉన్న చింతమనేని కోసం గాలింపు..

Published : Jul 07, 2022, 06:42 AM ISTUpdated : Jul 07, 2022, 06:45 AM IST
పటాన్ చెరు సమీపంలో కోడి పందేలు, 21మంది అరెస్ట్...పరారీలో ఉన్న  చింతమనేని కోసం గాలింపు..

సారాంశం

పటాన్ చెరు సమీపంలో నిర్వహించిన కోడి పందేల్లో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. పోలీసులు దాడి చేయడంతో ఆయన పరారయ్యాు. ఈ ఘటనలో ఇద్దరు నిర్వాహకులతో పాటు 21మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంగారెడ్డి : పటాన్చెరుమండలం చిన్నకంచర్లలో కోడి పందేలు నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం పోలీసులకు అందడంతో…కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడి చేశారు. 21 మందిని అరెస్టు చేశారు. రూ.13.12 లక్షలు, 26 వాహనాలు, 27  ఫోన్లు, 31 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70మంది కోడి పందేలలో పాల్గొన్నారని పటాన్చెరు డిఎస్పీ తెలిపారు. చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో ఈ పందేలు సాగుతున్నాయని డిఎస్పీ వెల్లడించారు. అక్కినేని సతీష్, కృష్ణంరాజు, బర్ల రాజు అనే ముగ్గురు నిర్వాహకులను తెలిపారు. ఈ ఘటనలో చింతమనేని ప్రభాకర్ తో పాటు చాలా మంది పరారయ్యారని డిఎస్పి పేర్కొన్నారు. అక్కినేని సతీష్, బర్ల రాజు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు మూడు బృందాలను నియమించామని డిఎస్పీ వివరించారు. 

పటాన్ చెరులో కోడి పందాలు.. పోలీసుల ఆకస్మిక దాడి, పరారీలో టీడీపీ నేత చింతమేనేని

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave : హమ్మయ్యా..! ఇక చలిగండం గట్టెక్కినట్లేనా..?
Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులు 9 కాదు 6 రోజులే..? తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్