హయత్‌నగర్ కుంట్లూరులో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్: నాలుగు ఇళ్లలో చోరీ

By narsimha lode  |  First Published Jul 7, 2022, 9:27 AM IST


హైద్రాబాద్ హయత్ నగర్ కు సమీపంలోని కుంట్లూరులో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ సృష్టించింది. కుంట్లూరులోని నాలుగు ఇళ్లలో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


హైదరాబాద్: నగర శివారల్లోని Hayathnagar  కుంట్లూరులో  Cheddi Gang హల్ చల్ సృష్టించింది. kuntloorలోని  నాలుగు ఇళ్లలో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. చోరీకి పాల్పడిన ఇళ్ల వద్ద ఉన్న CCTV  కెమెరాల సహాయంతో పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురు సభ్యుల చెడ్డ గ్యాంగ్ ముఠా ఈ చోరీకి పాల్పడిందని సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

విలియమ్స్ సన్ ఇంట్లో 7.5 తులాల బంగారం, 80 తులాల వెండిని దొంగలు చోరీ చేశారు. చోరీకి పాల్పడిన దొంగలు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ పుటేజీలో దొంగలను పోలీసులు గుర్తించారు.బాధితులు తమ ఇళ్లలో చోరీకి గురైన వస్తువులు, నగదు గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.   కొంత కాలంగా నగరంలో  చెడ్డీ గ్యాంగ్ ఎలాంటి ఘటనలకు పాల్పడలేదు. అయితే తాజాగా చెడ్డీ గ్యాంగ్  కుంట్లూరు సమీపంలో చోరీలకు పాల్పడడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Latest Videos

undefined

గతంలో కూడా హయత్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ దోపీడీకి పాల్పడింది. 2019 నవంబర్ 23న చెడ్డీ గ్యాంగ్ హయత్ నగర్ లో వరుస చోరీలకు పాల్పడింది. శివార్లలో  చోరీలకు పాల్పడింది ఈ గ్యాంగ్. 2019లో నెల రోజుల వ్యవధిలోనే రెండు దఫాలు హయత్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ దోపీడీలకు పాల్పడింది. చోరీలకు పాల్పడిన దొంగలు పోలీసుల ముందు నుండే పారిపోయిన కూడా పోలీసులు పట్టుకోలేదని అప్పట్లో  బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.ఆరుగురు సభ్యులు చెడ్డీ గ్యాంగ్ ఆ సమయంలో దోపీడీకి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ పుటేజీలో పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యుల ఫోటోలను విడుదల చేశారు.

also read:బస్వాపూర్ గ్రామీణ బ్యాంకు చోరీ:మూసాపేటలో మంకీ క్యాప్‌లు కొనుగోలు చేసిన దొంగలు

2021 జూలై 23న చెడ్డీ గ్యాంగ్ హైద్రాబాద్ నగరంలో మరోసారి చోరీలకు పాల్పడింది. ఈసీఐఎల్ నాగారం ప్రాంతంలోని పలు ఇళ్లలో చెడ్డీ గ్యాంగ్ చోరీలు చేసింది. దుండుగులు ఎక్కువగా తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతారు. అంతేకాదు చోరీలు చేసే ముందు ఇళ్ల వద్ద దొంగలు రెకకీ నిర్వహిస్తారు.ఏ ఇళ్లు చోరీలకు అనువుగా ఉంటాయో ఎంచుకొని ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడుతారు.చోరీలు చేసి పారిపోయే సమయంలో దొంగలు తాము ఎవరికీ కూడా దొరకకుండా ఉండేందుకు గాను తమ శరీరానికి ఆయిల్  లేదా నూనె పూసుకొంటారు. ఒంటి మీద షార్ట్  మినహా బట్టలు వేసుకోరు. దీంతో వీరిని చెడ్డీ గ్యాంగ్ గా పిలుస్తారు

click me!