కేసీఆర్ వ్యూహానికి విరుగుడు: తొలిసారి పీవీని స్మరించిన సోనియా గాంధీ

By Sreeharsha GopaganiFirst Published Jul 25, 2020, 9:28 AM IST
Highlights

కాంగ్రెస్ పీవీ విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలను అదునుగా చేసుకొని, పీవీని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసి ఆయనను కాంగ్రెస్ సింబల్ గా కాకుండా తెలంగాణ ముద్దుబిడ్డగా కేసీఆర్ ప్రోజెక్టు చేస్తుండడంతో కాంగ్రెస్ అధిష్టానం అలెర్ట్ అయింది. పీవీ అంటేనే పడని సోనియా గాంధీ... పీవీ మావాడంటూ స్టేట్మెంట్ ని విడుదల చేసింది. 

పీవీ నరసింహ రావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. రోడ్లపైన హోర్డింగులు నుంచి మొదలు టీవీ ఛానెళ్లలో యాడ్స్ వరకు ఎక్కడ చూసినా మనకు ఇదే కనబడుతుంది. కేసీఆర్ పదే పదే తెలంగాణ ఐకాన్ గా పీవీని ప్రోజెక్టు చేస్తున్నారు. 

కాంగ్రెస్ పీవీ విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలను అదునుగా చేసుకొని, పీవీని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసి ఆయనను కాంగ్రెస్ సింబల్ గా కాకుండా తెలంగాణ ముద్దుబిడ్డగా కేసీఆర్ ప్రోజెక్టు చేస్తుండడంతో కాంగ్రెస్ అధిష్టానం అలెర్ట్ అయింది. పీవీ అంటేనే పడని సోనియా గాంధీ... పీవీ మావాడంటూ స్టేట్మెంట్ ని విడుదల చేసింది. 

సోనియా గాంధీ తోపాటుగా రాహుల్ సైతం పీవీ నరసింహ రావును ఆకాశానికి ఎత్తడమే కాకుండా అయన కాంగ్రెస్ వాది అని చెప్పే ప్రయత్నం చేసారు. పీవీ నర్సింహారావు తజయంతి ఉత్సవాలను కాంగ్రెస్ కూడా నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. 

దీనిని పురస్కరించుకొని శుక్రవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ఏడాదిపాటు నిర్వహించ తలపెట్టిన ఉత్సవాల సందర్భంగా  సోనియా తన సందేశాన్ని పంపించారు. ఈ సందేశాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివారు. 

రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన పీవీ నరసింహారావు.. దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, ఆయన నాయకత్వంతో దేశం ఎన్నో సవాళ్లను అధిగమించగలిగిందని సోనియా అన్నారు. 

ఆయన అంకితభావం కలిగిన కాంగ్రెస్‌ వ్యక్తి అని, పార్టీలో పలు బాధ్యతలను అంకితభావంతో నిర్వహించారని సోనియా తన సందేశంలో తెలిపారు. దేశం ఆర్ధిక సాక్షిభా సమయంలో ఉన్నప్పుడు ఆయన ఎలా దేశాన్ని గట్టున పడేశారో కూడా ఆమె వివరించారు. 

బహిరంగంగా గాంధీ కుటుంబం పీవీని పొగడడం ఇదే  తొలిసారి. సోనియా తోపాటుగా రాహుల్ సైతం తమ సందేశాలను పంపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి కేసీఆర్ నిర్ణయం ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్నే మార్చినట్టుంది..!

click me!