పిల్లలతో కలిసి ఉరేసి భర్తను చంపిన మహిళ: ఆ తర్వాత డ్రామాలు

Published : Jul 25, 2020, 07:27 AM IST
పిల్లలతో కలిసి ఉరేసి భర్తను చంపిన మహిళ: ఆ తర్వాత డ్రామాలు

సారాంశం

తన పిల్లలతో కలిసి ఓ మహిళ తన భర్తను ఉరేసి చంపింది. ఆ తర్వాత నిద్రలోనే చనిపోయాడని బుకాయించింది. అయితే, బంధువులు వచ్చి చూడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: తాగుబోతు భర్తను భరించలేక ఓ మహిళ తన భర్తను ఉరేసి చంపింది. ఇందులో ఆమెకు కుమారులు కూడా సహకరించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్ాల చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ లో గురువారం జరిగింది. 

మల్కాపూర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల వయస్సు గల వ్యవసాయ కూలీ మద్యానికి బానిసయ్యాడు. కూలీ డబ్బులతో తాగేసి నిత్యం భార్యాపిల్లలను వేధిస్తూ వస్తున్నాడు. కాగా, ఈ స్థితిలో అతని కూతురికి వివాహం నిశ్చయమైంది. 

పెళ్లి కోసం తెచ్చిన డబ్పులతో కూడా అతను తాగుతూ వచ్చాడు. దీంతో భార్య భరించలేకపోయింది. గురువారం రాత్రి కూడా అతను తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దాంతో ఆగ్రహించి భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి అతడికి ఉరి బగించి చంపేసింది. నిద్రలోనే చనిపోయాడని శనివారం ఉదయం ఇరుగుపొరుగువారికి చెప్పింది. 

బంధువులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించగా మెడకు తాడుతో ఉరివేసినట్లు తేలింది. దాంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో తామే నేరం చేశామని నిందితులు అంగీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం