24 గంటల్లో 1,640 కేసులు.. 1,007 మంది డిశ్చార్జ్: తెలంగాణలో 52 వేలు దాటిన సంఖ్య

By Siva KodatiFirst Published Jul 24, 2020, 9:43 PM IST
Highlights

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 1,640 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 52,466కి చేరుకున్నాయి

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 1,640 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 52,466కి చేరుకున్నాయి.

శుక్రవారం వైరస్ కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 455కి చేరింది. ఇవాళ 1,007 మంది డిశ్చార్జ్ అవ్వడంతో కోలుకున్న వారి సంఖ్య 40,334కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 11,677 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Also Read:ప్రగతి భవన్ వద్ద కలకలం: పారిశుద్య కార్మికురాలు ఆత్మహత్యాయత్నం

శుక్రవారం ఒక్క హైదరాబాద్‌లోనే 683 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఆ తర్వాత రంగారెడ్డి 135, సంగారెడ్డి 102, కరీంనగర్ 100, పెద్దపల్లి 98, కామారెడ్డి 56, నాగర్ కర్నూలు 52, మహబూబాబాద్ 44, మేడ్చల్ 30, నల్గొండ 42, వరంగల్ అర్బన్ 36, వరంగల్ రూరల్‌లో 22 మందికి పాజిటివ్‌గా తేలింది. 

కాగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో మరో ఇద్దరు ఎస్సైలకు కరోనా పాజిటివ్ గా తేలింది. వీరితో కలిపి ఇప్పటివరకు ఈ స్టేషన్లో మొత్తం 33మంది కరోనా బారిన పడ్డారు. 

తాజాగా కరోనా నిర్దారణ అయిన ఇద్దరు ఎస్సైలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. మిగతా పోలీస్ సిబ్బంది కూడా ప్రస్తుతం   వివిద ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. 

click me!