Wines closed : మద్యం ప్రియులకు షాక్.. రేపు వైన్స్, రెస్టారెంట్లు బంద్.. ఎందుకంటే ?

By Asianet News  |  First Published Dec 2, 2023, 5:48 PM IST

Wines closed : ఎప్పుడెప్పుడా అని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దీని కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ దృశ్యా రేపు వైన్స్, రెస్టారెంట్లు మూసి ఉండనున్నాయి.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కొన్ని గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. రేపు సాయంత్రానికళ్లా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది ? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది ? ప్రతిపక్షంలో కూర్చోబోతోంది ఎవరనే విషయాలపై స్పష్టత రానుంది. 

అసైన్డ్ భూములు బినామీలకు కట్టబెట్టేందుకు బీఆర్ఎస్ కుట్ర - కాంగ్రెస్.. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు

Latest Videos

undefined

ఇదిలా ఉండగా.. ఆదివారం కౌంటింగ్ నేపథ్యంలో వైన్ షాపులు, రెస్టారెంట్లు బంద్ కానునున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం వైన్ షాపులను మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.

2018లో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి ? అంచనాలు నిజమయ్యాయా ?

మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఫలితాలను లెక్కించేందుకు అధికారులు 49 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఈ కేంద్రంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి అరగంట తర్వాత ఈవీఎంలను తెరుస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు ఎక్కువ సమయం పడితే.. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపుతో పాటే వాటిని కూడా సమాంతరంగా లెక్కిస్తారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.

DK Shivakumar : తెలంగాణకు డీకే శివ కుమార్.. మా అభ్యర్థులను కేసీఆర్ స్వయంగా సంప్రదిస్తున్నారంటూ వ్యాఖ్యలు..

కాగా.. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి మూడెంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొదటి అంచె భద్రతను కేంద్ర బలగాలు నిర్వహిస్తుండగా, రెండో అంచెను స్టేట్ ఆర్మ్ డ్ రిజర్వ్ చూసుకుంటోంది. మూడో అంచెను రాష్ట్ర పోలీసు బలగాలు చూసుకోనున్నాయి. కౌంటింగ్ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ ల భద్రత కోసం మొత్తం 40 కంపెనీల సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ ను మోహరించారు కౌంటింగ్ కేంద్రాల్లో మొత్తం 1,766 కౌంటింగ్ టేబుళ్లు ఉండనున్నాయి. రిటర్నింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుళ్లు ఉన్నాయి.

ప్రతీ కాంగ్రెస్ అభ్యర్థి వెంట ఏఐసీసీ పరిశీలకులు.. గెలిచిన ఎమ్మెల్యే సర్టిఫికేట్ తీసుకొని నేరుగా..

అయితే గత ఎన్నికల కంటే ఈ సారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఉండటం, కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటం, చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో ప్రతి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ప్రతీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లు, 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుళ్లు ఉంటాయి. ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ఈ ఎన్నికల్లో 71.34 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 3,26,02,793 మంది ఓటర్లకు గాను 2,32,59,256 మంది తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. 

click me!