కాంగ్రెస్ అభ్యర్ధి మైనంపల్లి హనుమంతరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

By Siva Kodati  |  First Published Dec 2, 2023, 4:58 PM IST

ఎమ్మెల్యే, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్ధి మైనంపల్లి హనుమంతరావుపై అట్రాసిటీ కేసు నమోదైంది. బీఆర్ఎస్ నేత కరంచందర్‌ను మైనంపల్లి హనుమంతరావు కులం పేరుతో దూషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 


ఎమ్మెల్యే, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్ధి మైనంపల్లి హనుమంతరావుపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలంలోని యాప్రాల్‌కు చెందిన బీఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ నేత కరంచందర్‌ను మైనంపల్లి హనుమంతరావు కులం పేరుతో దూషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కరంచందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జవహర్‌నగర్ పోలీసులు మైనంపల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 

Also Read: ఇవేం తిట్లు రా బాబు .. మంత్రి మల్లారెడ్డి, హరీష్ రావులపై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

Latest Videos

కాగా.. 2009లో మెదక్ నుండి మైనంపల్లి హన్మంతరావు టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు  మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ లో చేరారు.  2014లో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన  బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  2018 నుండి మల్కాజిగిరి నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  2023లో మల్కాజిగిరి నుండి  మైనంపల్లి హన్మంతరావుకు  టిక్కెట్టు దక్కింది. అయితే మెదక్ అసెంబ్లీ స్థానం నుండి  తనయుడు రోహిత్ కు  బీఆర్ఎస్ దక్కలేదు. దీంతో  మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరారు. 
 

click me!