పవన్ పార్టీలోకి ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ !

Published : Feb 27, 2017, 01:54 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
పవన్ పార్టీలోకి ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ !

సారాంశం

ప్రజా సమస్యలు, అభివృద్ధి పై  జనసేన్ బాగానే గళం వినిపిస్తోందని జ్వాల ప్రశంసించింది.

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పార్టీకి అన్నీ తానై నడిపిస్తున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా పైనే కాకుండా ప్రాంతీయ సమస్యలు,  కార్మికుల సమస్యలపై కూడా బాగా పోరాడుతున్నారు.

ఇప్పుడు ప్రజలు ఆయన్ను ఓ హీరోలా కాకుండా తమ నాయకుడిగా చూస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అందుకే చాలా మంది ఆయన పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెఢీ అవుతున్నారు. కానీ, పవన్ మాత్రం ఇంకా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టలేదు.అయితే సినిమాలో ప్రభాస్ ఫ్యాన్ అయిన ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాత్రం ఇప్పుడు పవన్ పార్టీ వైపు చూస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు... బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల.

ఇటీవల ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారని, త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతారని టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. తాను ఏ పార్టీలో చేరినా స్టార్ క్యాంపెయినర్ కావాలనుకోవడం లేదని, ఒక వేళ రాజకీయాల్లోకి వస్తే క్రియాశీలకంగా పనిచేస్తా, నాకు అప్పగించిన పదవికి న్యాయం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొంది.

 

పవన్ జనసేన గురించి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు, అభివృద్ధి పై ఆ పార్టీ బాగానే గళం వినిపిస్తోందని ప్రశంసించింది. దీంతో ఆమె టీఆర్ఎస్ లో కాదు జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..