
అమెరికాలో కాల్పులకు గురై మరణించిన తెలగువాడు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూచిబొట్ల శ్రీనివాస్ కు కన్సాస్ లోని స్థానికులు ఘనంగా నివాళి అర్పించారు.
శాంతియుత ర్యాలీ నిర్వహించి మీకు మీం ఉన్నామంటూ భరోసా ఇచ్చారు. జాతివివక్ష రాజకీయాలను సహించేది లేదని స్పష్టం చేశారు.
ర్యాలీలో పాల్గన్నవారు వీ వాంట్ పీస్ , వీ వాంట్ లవ్, లెట్స్ నాట్ లీవ్ అవర్ చిల్ట్రన్ అంటూ నినదించారు.
ఐక్యమత్యమే మా బలం... కలసిటుంటేనే నిలబడగలం, విడిపోతే పడిపోతాం అనే సందేశాన్నిచ్చారు.
శ్రీనివాస్ ఫొటోలు, జాతివివక్షతను వ్యతిరేకిస్తూ ప్లకార్టులు పట్టుకుంటూ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీకి శ్రీనివాస్ స్నేహితులు నేతృత్వం వహించారు.
ర్యాలీ అనంతరం సర్వమత ప్రార్దనలు కూడా నిర్వహించారు. అక్కడి హిందూ దేవాలయంలో పూజలు నిర్వహించారు.
ర్యాలీనుద్దేశించి కాల్పుల్లో గాయపడిన మరో తెలుగు వ్యక్తి అలోక్ మాట్లాడుతూ... శ్రీనివాస్ అందరి శ్రేయోభిలాషని, మృదుస్వభావని కొనియాడారు. ఆయనతో తనకున్న తొమ్మిదేళ్ల స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస్ మిత్రులు కూడా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో గత బుధవారం ఓ తెల్లజాతీయుడు కాల్పులు జరపడంతో వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ కూచిబొట్ల అక్కడికక్కడే మరణించగా.. అలోక్ మాదసాని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.