Top Stories: 100 రోజుల్లో 6 గ్యారంటీలు.. మంత్రులకు శాఖలు, రైతు బంధు ఎప్పుడు?, మూడ్రోజుల్లో కేసీఆర్ డిశ్చార్జీ

By Mahesh K  |  First Published Dec 10, 2023, 6:21 AM IST

సీఎం రేవంత్ రెడ్డి శనివారం రెండు హామీలను ప్రారంభించారు. మహిళలందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించే మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించారు. అలాగే రూ.10 లక్షల కవరేజీతో రాజీవ్ ఆరోగ్య శ్రీ చేయూత ప్రారంభించారు. హాస్పిటల్‌లో శనివారం కేసీఆర్ కాసేపు నడిచారు. 101 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు. 
 


Top Stories: రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు గ్యారంటీలను శనివారం అమల్లోకి తెచ్చింది. శనివారం మధ్యాహ్నం మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. కొన్ని రోజుల తర్వాత జీరో టికెట్ జారీ చేయనున్నారు. రూ. 10 లక్షల కవరేజీతో రాజీవ్ ఆరోగ్య శ్రీ చేయూత పథకాన్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ఇస్తామన్న గ్యారంటీని సోనియా గాంధీ నెరవేర్చినట్టే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలను తప్పక అమలు చేస్తుందని వివరించారు.

శాఖల కేటాయింపులు:

Latest Videos

undefined

సీఎం రేవంత్ రెడ్డి: 
పురపాలన - పట్టణాభివృద్ధి, సాధారణ పాలన శాఖ, హోం శాఖ, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క:
ఆర్థిక - ప్రణాళిక, విద్యుత్ శాఖ

ఉత్తమ్ కుమార్ రెడ్డి:
నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ

రాజనర్సింహా:
వైద్యారోగ్య, కుటంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శఖ

కోమటిరెడ్డి వెంకటరెడ్డి:
రోడ్లు - భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ

శ్రీధర్ బాబు:
ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ

పొంగులేటి శ్రీనివాస రెడ్డి:
రెవెన్యూ, గృహ నిర్మాణం, పౌర సంబంధాల శాఖ

పొన్నం ప్రభాకర్:
రవాణా, బీసీ సంక్షేమ శాఖ

కొండా సురేఖ:
అటవీ - పర్యావరణం, దేవాదాయ శాఖ

అనసూయ సీతక్క:
పంచాయతీ రాజ్ - గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ

తుమ్మల నాగేశ్వరరావు
వ్యవసాయం, మార్కిటెంగ్ చేనెత శాఖ

జూపల్లి కృష్ణారావు
ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతి, పురావస్తు శాఖ

Also Read: Telangana Assembly: ఇద్దరు మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు - ఎందుకు?

మూడ్రోజుల్లో కేసీఆర్ డిశ్చార్జీ!

యశోద హాస్పిటల్‌లో కేసీఆర్ మెల్లిగా కోలుకుంటున్నారు. శనివారం ఆయనను వైద్యులు వాకర్ సాయంతో తింపారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. కాగా, బీఆర్ఎస్ నేత కేసీఆర్‌ను శనివారం బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. అసదుద్దీన్ ఒవైసీ, చిన్న జీయర్ స్వామి హాస్పిటల్ వచ్చి పరామర్శించారు.

Also Read: LPG Cylinder: సిలిండర్ ధరపై వదంతులు.. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ముందు క్యూలు.. వాస్తవం ఏమిటీ?

14న స్పీకర్ ఎన్నిక:

ఈ నెల 14వ తేదీన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. కాంగ్రెస్ ఇప్పటికే స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్‌ను నిర్ణయించింది. దళిత నేత కావడంతో ప్రతిపక్షాలూ ఆయనకు మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ ఎన్నిక కోసం 11వ లేదా 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 15వ తేదీన గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతంది. శనివారం 101 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు.

Also Read: Rythu Bandhu: రైతు బంధుపై పొలిటికల్ హీట్.. ఎప్పుడిస్తారని హరీశ్ రావు ప్రశ్న.. మంత్రి సీతక్క సమాధానం

రైతు బంధు ఎప్పుడు?

డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు డబ్బులు వేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, ఆ డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు. దీనికి అంత ఆత్రం ఎందుకని ప్రశ్నించారు. రైతులకు ఏం కావాలో అడగడం లేదని, రైతు బంధు మాత్రమే అడుగుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌజ్‌లు, వందల ఎకరాల భూములకు రైతు బంధు వేసుకున్నారని ఆరోపించారు.

click me!