LPG Cylinder: సిలిండర్ ధరపై వదంతులు.. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ముందు క్యూలు.. వాస్తవం ఏమిటీ?

By Mahesh KFirst Published Dec 10, 2023, 3:15 AM IST
Highlights

కాంగ్రెస్ రూ.500కే సిలిండర్‌ను మహాలక్ష్మీ పథకం కింద అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద లబ్దిదారులను గుర్తిస్తున్నారనే రూమర్లు ప్రచారం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ముందు బారులు తీరారు.
 

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎల్పీజీ సిలిండర్‌లన రూ. 500కే అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వదంతులు వ్యాపించాయి. దీంతో చాలా మంది మహిళలు ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ముందు బారులు తీరారు. శనివారం చాలా చోట్ల ఈ దృశ్యాలు కనిపించాయి. రూ. 500కే సిలిండర్ పొందడానికి కాంగ్రెస్ ప్రకటించిన మహా లక్ష్మీ స్కీమ్‌ కోసం లబ్దిదారులను గుర్తిస్తున్నట్టు వదంతులు వచ్చాయి. దీంతో మహిళలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ముందు బారులు తీరారు. 

నిజానికి ఎల్పీజీ సెంటర్‌లలో జరుగుతున్న ప్రాసెస్‌తో ఈ పథకానికి సంబంధమే లేదు. వారు వినియోగదారుల ఈకేవైసీని అప్‌డేట్ చేస్తున్నారు. కేంద్ర చమురు, సహజజవాయు మంత్రిత్వ శాఖ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లు పొందుతున్న వినియోగదారుల ఈకేవైసీ తప్పనిసరి చేసింది. చమురు కంపెనీలకూ ఈ ఆదేశాలు జారీ చేసింది. తప్పకుండా ఈ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. అందుకే ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో వారు ఈకేవైసీ అప్‌డేట్ చేసుకుంటున్నారు.

Latest Videos

Also Read: Rythu Bandhu: రైతు బంధుపై పొలిటికల్ హీట్.. ఎప్పుడిస్తారని హరీశ్ రావు ప్రశ్న.. మంత్రి సీతక్క సమాధానం

ఇదిలా ఉండగా మహాలక్ష్మీ పథకానికి సంబంధించిన రూమర్లు ప్రచారం అయ్యాయి. దీనికితోడు మరో సంశయం కూడా ముందుకు వచ్చింది. కేవైసీని అప్‌డేట్ చయేకుండా ఎల్పీజీ సిలిండర్ల సబ్సిడీని నిలిపేస్తారా? అనే ఆందోళనలు ప్రజల్లో వచ్చాయి.  అయితే, సబ్సిడీ ఆపేయాలనే అధికారిక ప్రకటన మాత్రం ఏమీ లేదని అధికారులు, ఏజెన్సీలు చెబతున్నా మహిళలు మాత్రం క్యూలు కడుతూనే ఉన్నారు.

హైదరాబాద్‌లోని ముషీరాబాద్, భవానీ నగర్, సంతోష్ నగర్, మలక్ పేట్, టోలీ చౌకి, అల్వాల్, సనత్ నగర్‌లలో శనివారం ఈ లైన్లు కనిపించాయి.

click me!