పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారంపై ఆయన భార్య, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ శైలజ వివరణ ఇచ్చారు. పుట్ట మధుకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలున్నాయని చెప్పారు.
కరీంనగర్: పెద్ద జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు కనిపించుకుండా పోయారనే వార్తలపై ఆయన భార్య, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ వివరణ ఇచ్చారు. పుట్ట మధు ఎక్కడికీ వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు. తన భర్త పుట్ట మధుకు స్వల్వంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, అందుకే ఫోన్ స్విఛాఫ్ చేశారని ఆమె చెప్పారు.
పుట్ట మధుపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ప్రజాప్రతినిధులు వ్యక్తిగత జీవితం కూడా ఉంటుందని ఆమె అన్నారు. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ లో ఉండేవారని, అందుకే ఆయనను అప్పట్లో కలిశామని ఆమె చెప్పారు తాము టీఆర్ఎస్ లోని ఉంటామని శైలజ చెప్పారు.
undefined
Also Read: టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అదృశ్యం
తమను ఈ స్థాయికి తీసుకుని వచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరే అని ఆమె చెప్పారు. పుట్ట మధుపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, పుట్ట మధు కనిపించకుండా పోయారని ప్రచారం సాగుతోంది. ఆయన ఏప్రిల్ 30వ తేదీన ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత కనపించకుండా పోయారని చెబుతున్నారు. ఆయన సెల్ ఫోన్ స్వీచాఫ్ చేసి ఉందని అంటున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లారనే విషయంపై పలు రకాలుగా ప్రచారం సాగుతోంది. మహారాష్ట్రకు వెళ్లారని కొందరు, కర్ణాటకకు వెళ్లారని మరికొందరు భావిస్తున్నారు.