నైట్ కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు.. పెళ్లిళ్లకు 100 , అంత్యక్రియలకు 20 మంది: తెలంగాణలో కొత్త ఆంక్షలు

By Siva KodatiFirst Published May 7, 2021, 7:08 PM IST
Highlights

తెలంగాణలో కోవిడ్ కేసులు అదుపులోకి రాకపోవడంతో కేసీఆర్ సర్కార్ మరోసారి నైట్ కర్ఫ్యూను మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో కోవిడ్ కేసులు అదుపులోకి రాకపోవడంతో కేసీఆర్ సర్కార్ మరోసారి నైట్ కర్ఫ్యూను మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

అయితే మొదట్లో మే 8వ తేదీ వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పాటు నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. పెళ్లిళ్లకు 100 మందికి మించకుండా, అంత్యక్రియలకు 20 మంది మించరాదని స్పష్టం చేసింది.

Also Read:ఖాళీగా 23 వేల బెడ్లు.. ఆక్సిజన్, వ్యాక్సిన్‌పై కేంద్రంతో టచ్‌లోనే: డీహెచ్ శ్రీనివాస్

భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, మతపరమైన, సాంస్కృతిక సమావేశాలు, కార్యక్రమాలపై నిషేధం విధించింది. కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.  

అంతకుముందు వ్యాక్సిన్లు, ఆక్సిజన్ కొరతపై కేంద్రాన్ని సంప్రదించామన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా వున్నాయో బులిటెన్‌లో వెల్లడిస్తున్నామని శ్రీనివాస్ చెప్పారు.

కరోనా పరిస్ధితులపై సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో మాట్లాడారని డీహెచ్ వెల్లడించారు. తెలంగాణకు సహకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం 23 వేల బెడ్లు ఖాళీగా వున్నాయని శ్రీనివాస్ తెలిపారు. 

click me!