రోడ్డు ప్రమాదం కారు నుజ్జు నుజ్జు: సుల్తాన్ బజార్ సీఐ దంపతుల దుర్మరణం

Published : May 08, 2021, 07:15 AM ISTUpdated : May 08, 2021, 01:37 PM IST
రోడ్డు ప్రమాదం కారు నుజ్జు నుజ్జు: సుల్తాన్ బజార్  సీఐ దంపతుల దుర్మరణం

సారాంశం

రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుల్తాన్ బజార్ సీఐ దంపతులు మరణించారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద శనివారం ఉదయం ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మరణించారు.  అగి ఉన్న లారీని అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది.

ఈ రోడ్డు ప్రమాదంలో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సీ మరణించారు. వారిద్దరు కారులో ఇరుక్కుపోయి మృతి చెందారు. లక్ష్మణ్ హైదరాబాదులోని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. 

ఈ ప్రమాదం నుంచి వారి ఎనిమిదేళ్ల కుమారుడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం సమయంలో ఝాన్సీ  కారు నడుపుతున్నట్లు గుర్తించారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!