ప్రియుడితో రాసలీలలు: ఆకస్మాత్తుగా ఇంటికొచ్చిన భర్త, చివరికిలా....

Published : Aug 08, 2021, 12:23 PM IST
ప్రియుడితో రాసలీలలు: ఆకస్మాత్తుగా ఇంటికొచ్చిన భర్త, చివరికిలా....

సారాంశం

ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని భర్త రోషన్ ను వివాహిత లత హత్య చేసింది. ఈ ఘటన హైద్రాబాద్ నాంపల్లి పరిధిలోని హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ లో చోటు చేసుకొంది. 


హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కట్టుకొన్న భర్తను ఓ భార్య దారుణంగా హత్య చేసింది.ఈ ఘటన హైద్రాబాద్ నాంపల్లి పరిధిలోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ లో శనివారం నాడు చోటు చేసుకొంది.హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాన్గార్ బస్తీకి చెందిన హోటల్ కార్మికుడు రోషన్ కు అదే బస్తీకి చెందిన లతకు కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు, ఓ మగ పిల్లాడు.  ఇదే బస్తీకి చెందిన యువరాజు అనే యువకుడితో  లతకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

భర్త ఇంట్లో లేని సమయంలో యువరాజు,  లత  ఏకాంతంగా కలుసుకొనేవారు. అయితే శనివారం నాడు వీరిద్దరూ ఏకాంతంగా ఇంట్లో ఉన్న సమయంలో భర్త రోషన్ ఇంటికి వచ్చాడు.  దీంతో ఏం వారిద్దరూ షాక్ కు గురయ్యారు. భర్త తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని కొంతకాలంగా లత భావిస్తోంది. దీంతో ప్రియుడితో కలిసి వెంటనే కత్తితో భర్తను పొడిచింది. వెంటనే రోషన్ అక్కడికక్కడే మరణించాడు.

ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.రోషన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువరాజ్ కు గతంలో రెండు పెళ్లిళ్లు అయినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu