టెన్షన్: సీఎం కేసీఆర్ కాన్వాయ్ కి ఎదురుగా బైక్ మీద దూసుకెళ్లిన పిల్లలు

By telugu teamFirst Published Aug 8, 2021, 6:55 AM IST
Highlights

ఇద్దరు పిల్లలు బైక్ మీద సీఎం కేసీఆర్ కాన్వాయ్ కి ఎదురుగా రాంగ్ రూట్ లో దూసుకెళ్లి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. చివరకు పోలీసులు వారిని పట్టుకుని విచారించారు.

హైదరాబాద్: ఇద్దరు పిల్లలు బైక్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కాన్వాయ్ కి ఎదురుగా వెళ్లి టెన్షన్ పెట్టారు. కాన్వాయ్ ఇద్దరు పిల్లలు బైక్ మీద రాంగ్ రూట్ లో కేసీఆర్ కాన్వాయ్ కి ఎదురుగా రావడంతో పోలీసులు పరుగులు పెట్టారు. శనివారం సాయంత్రం ఈ సంఘటన హైదరాబాదులోని ఎన్టీఆర్ మార్గ్ లో జరిగింది. 

సచివాలయ నిర్మాణ పనులకు కేసీఆర్ వస్తున్న సమయంలో ఎన్టీఆర్ మార్గ్ లో ఇరువైపులా పోలీసులు వాహనాలను ఆపేశారు. అయితే, ఇద్దరు పిల్లలు ఓ బైక్ మీద తెలుగుతల్లి చౌరస్తా వైపు నుంచి ముఖ్యమంత్రి వస్తున్న దారిలో రాంగ్ రాట్ లో వెళ్లారు. పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా వేగంగా ముందుకు వెళ్లారు. 

దాంతో సీఎం కాన్వాయ్ కి పిల్లల బైక్ ఎదురుగా వచ్చింది. పోలీసులు వారిని పట్టుకుని స్టేషన్ కు తరలించి విచారించారు. వారి వయస్సు 11, 14 ఏళ్లు ఉంటుంది. వారిలో ఒకతను శాస్త్రిపురంలో ఉంటుండగా మరొకతను నీలోఫర్ ప్రాంతానికి చెందినవాడు. వారికి ఓ గుర్తు తెలియని వ్యక్తి టూవీలర్ ను రెండు వేల రూపాయలకు విక్రయించాడు. 

దాన్ని తీసుకుని చార్మినార్ వెళ్లి అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డుపై వస్తున్నారు. ఆ వాహనం చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. వాహనం చోరీకి గురైనట్లు నార్సింగ్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదై ఉంది. పిల్లలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు వాహనం విక్రయించినవారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

click me!