పులిచింతల, సూర్యాపేట ప్రాంతాల్లో ఆదివారం నాడు భూకంపం వాటిల్లింది. గతంలో కూడ పులిచింతల ప్రాజెక్టు సమీప గ్రామాల్లో పలు దఫాలు భూకంపాలు చోటు చేసుకొన్నాయి.
గుంటూరు: గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలో ఆదివారం నాడు ఉదయం మూడు సార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకొన్నాయి. గతంలో కూడ పులిచింతల పరిసర గ్రామాల్లో భూకంపాలు చోటు చేసుకొన్నాయి. పులిచింతలతో పాటు సూర్యాపేట పరిసరాల్లోనూ భూకంపం సంభవించింది.
పులిచింతలకు సమీపంలోని గ్రామాలతో పాటు సూర్యాపేట పరిసర గ్రామాల్లో కూడ భూకంపాలు చోటు చేసుకొన్నాయని ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు ధృవీకరించారు.ఇవాళ ఉదయం 7:15 గంటల నుండి ఉదయం 8:20 మధ్య మూడుసార్లు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. వరుసగా పులిచింతలకు సమీపంలో భూకంపాలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.రిక్టర్ స్కేల్‌పై 2.3, 2.7, 3 గా భూకంప తీవ్రత నమోదైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
గతంలో పులిచింతల సమీప గ్రామాల్లో భూకంపాలు సంభవించాయి. పులిచింతల సమీపంలోని గుంటూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని గ్రామాల్లో భూమి కంపించింది. దీనిపై భూగర్భశాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ప్రమాదం లేదని తేల్చారు.ఇవాళ ఏపీలోని గుంటూరు జిల్లాలోని పులిచింతల, తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లాలో కూడ భూమి కంపించింది. ఈ విషయాన్ని ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు ధృవీకరించారు.