భువనగిరి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.
అతడు రోజు వారి కూలీగా పని చేసేవాడు. కొంత కాలం కిందట ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలో జరిగింది.
విషాదం.. మూడేళ్ల కిందట ప్రేమ వివాహం.. కలహాలతో దంపతుల బలవన్మరణం?
వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కాకినాడబస్తీలో 26 ఏళ్ల డి. వెంకటేష్ తన భార్యతో కలిసి జీవించేవాడు. ఈ దంపతులది ప్రేమ వివాహం. కొంత కాలం కిందటే పెళ్లి జరిగింది. అయితే పలు కారణాలతో వెంకటేష్ భార్య తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కూతురుపై సవతి తండ్రి అత్యాచారం.. రెండేళ్లుగా నరకయాతన
ఈ ఘటనపై సమాచారం అందటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో వారికి సూసైడ్ నోట్ లభించింది. తన మరణానికి ఎవరూ కారణం కాదని అందులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలో ఏకంగా ఐరన్ బస్ స్టాప్‌నే ఎత్తుకెళ్లిన దొంగలు.. ఏం జరిగిందంటే?
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726) నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.