విషాదం.. మూడేళ్ల కిందట ప్రేమ వివాహం.. కలహాలతో దంపతుల బలవన్మరణం?

By Asianet News  |  First Published Oct 6, 2023, 6:55 AM IST

మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న భార్యాభర్తలు విగత జీవులుగా కనిపించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. 


వారిద్దరూ దంపతులు. ఇద్దరి కులాలు వేరైనప్పటికీ.. మూడేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారని తెలుసుకొని ఎంతో సంబరపడ్డారు. కానీ శుభవార్త తెలిసిన కొన్ని గంటలకే వారిద్దరూ విగత జీవులుగా మారిపోయారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో గురువారం జరిగింది. 

కూతురుపై సవతి తండ్రి అత్యాచారం.. రెండేళ్లుగా నరకయాతన

Latest Videos

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేటలో ఎర్రం కృష్ణ- రమ్య దంపతులు నివసిస్తున్నారు. కృష్ణ అదే గ్రామానికి చెందిన వాడు కాగా.. భార్య కృష్ణ స్వస్థలం దమ్మపేట మండలం నెమలిపేట గ్రామం. వీరిద్దరూ మూడు సంవత్సరాల కింద ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన నాటి నుంచి ఈ దంపతులు కృష్ణ తన తల్లి నాగమ్మ ఇంట్లోనే జీవిస్తున్నారు. అయితే వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 

దీంతో 16 రోజుల కిందట అదే కాలనీలో వారు ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నారు. అక్కడే వేరు కాపురం పెట్టి నివసించడం మొదలుపెట్టారు. కాగా వీరిలో భర్త జీవనోపాధి కోసం తాపీ పనులు చేస్తుండగా.. భార్య కూలీ పనులకు వెళ్లేవారు. ఈ క్రమంలో గురువారం కృష్ణ రమ్యను గురువారం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు నిర్వహించడంతో మూడు నెలల గర్భవతి అని తేలింది.

ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్ కమీషన్ ఇవ్వలేదు.. యూపీలో బుల్డోజర్‌తో రోడ్డును తవ్వేశారు

ఈ శుభవార్త విని భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషించారు. అనంతరం ఇంటికి వచ్చారు. కానీ కొంత సమయంలోనే మళ్లీ వారి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో కోపంతో కృష్ణ.. రమ్య తండ్రికి ఫోన్ చేసి.. మీ బిడ్డను పుట్టింటికి తీసుకొని వెళ్లాలని సూచించారు. అయితే కొంత సమయం గడిచిన తరువాత నాగమ్మ తన కుమారుడికి ఫోన్ చేసింది. అయినా అటు నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె.. కుమారుడు-కోడలు వేరు కాపురం పెట్టిన అద్దె ఇంటికి వెళ్లింది.

కశ్మీరీల అసలైన ఆహారం రెస్టారెంట్‌లలో ఎందుకు లభించడం లేదు? ఆ వంటకాలెలా ఉంటాయి? 

బయటి నుంచి తలుపులు కొట్టింది. కానీ లోపలి నుంచి వారు గడియ తీయలేదు. దీంతో స్థానికులను సహాయం కోరి, తలుపులు పగులగొట్టించింది. లోపలకు వెళ్లి చూడటంతో కృష్ణ, రమ్య విగత జీవులుగా పడి ఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!