తనను పట్టించుకోవడం లేదని... భర్త పడుకున్నాక వేడి వేడి నూనె పోసిన భార్య

sivanagaprasad kodati |  
Published : Oct 08, 2018, 11:21 AM ISTUpdated : Oct 08, 2018, 11:30 AM IST
తనను పట్టించుకోవడం లేదని... భర్త పడుకున్నాక వేడి వేడి నూనె పోసిన భార్య

సారాంశం

పడుకున్న భర్త ఒంటిపై భార్య సలసల కాగుతున్న నూనెను పోసింది. హైదరాబాద్ కూకట్‌పల్లి భాగ్‌అమీర్‌ ప్రాంతానికి చెందిన కుమార్ చౌదరి, ప్రేమ్‌దేవిలకు 2006లో వివాహమైంది. 

పడుకున్న భర్త ఒంటిపై భార్య సలసల కాగుతున్న నూనెను పోసింది. హైదరాబాద్ కూకట్‌పల్లి భాగ్‌అమీర్‌ ప్రాంతానికి చెందిన కుమార్ చౌదరి, ప్రేమ్‌దేవిలకు 2006లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు... బంగారు ఆభరణాల దుకాణం నిర్వహించే కుమారస్వామికి వ్యాపారంలో నష్టాలు రావడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది.

దీంతో తన తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి వెళ్లిపోదామని కొద్దిరోజులుగా భార్యా పిల్లలకు చెబుతూ వస్తున్నాడు. అయితే ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల తన భర్త... తల్లిదండ్రుల వద్దే ఎక్కువ సమయం గడుపుతుండటంతో ప్రేమ్‌దేవి ఆగ్రహంతో ఉంది.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్య, పిల్లల వద్దకు వచ్చిన కుమార్ చౌదరి.. భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న ప్రేమ్‌దేవి భర్త ఒంటిపై సలసల కాగుతున్న వేడి నూనె పోసింది.

దీంతో కుమార్ చౌదరి చేతులు, కాళ్లతో పాటు ఇతర భాగాలు కాలిపోయాయి. వెంటనే చుట్టుపక్కల వారు అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం