30 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు: హైకోర్టులో ఈసీ కౌంటర్

By narsimha lodeFirst Published Oct 8, 2018, 11:06 AM IST
Highlights

ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్‌పై ఎన్నికల కమిషన్  సోమవారం నాడు  హైకోర్టులో  కౌంటర్ దాఖలు చేసింది

హైదరాబాద్: ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్‌పై ఎన్నికల కమిషన్  సోమవారం నాడు  హైకోర్టులో  కౌంటర్ దాఖలు చేసింది. దీంతో  టెక్నాలజీ సహాయంతో  బోగస్ ఓట్లను  తొలగించినట్టు హైకోర్టుకు ఈసీ స్పష్టం చేసింది.

ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డితో పాటు మరో  ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్‌పై  సోమవారం నాడు కోర్టులో వాదనలు సాగాయి. శుక్రవారం నాడు ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఎన్నికల కమిషన్ ‌ను ఆదేశించింది.

ఈ ఆదేశాల మేరకు  హైకోర్టులో ఈసీ ఇవాళ  కౌంటర్ దాఖలు చేసింది. టెక్నాలజీ సహాయంతో సుమారు 30 లక్షల బోగస్ ఓట్లను  ఏరివేసినట్టుగా ఈసీ ప్రకటించింది.  అంతేకాదు ఈ నెల 12వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని కూడ  హైకోర్టుకు  ఈసీ స్పష్టం చేసింది.

తొలుత పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలను విన్న కోర్టు.. ఆ తర్వాత ఈసీ తరపు న్యాయవాది వాదనలను వింది. అయితే ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్‌పై  విచారను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

సుప్రీంలో దాఖలైన పిటిషన్లను హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం ఆదేశించింది. సుప్రీం ఆదేశం మేరకు అక్టోబర్ 5వ తేదీన ఈ విషయమై విచారణ జరిగింది. ఈ విచారణ కొనసాగింపుగా  ఇవాళ మరోసారి జరిగింది. 

 

సంబంధిత వార్తలు

ఓటర్ల జాబితా అవకతవకలు: విచారణ సోమవారానికి వాయిదా

 

click me!