బాత్రూంకి వెళ్లి నీళ్లు పోయని భర్త.. దంపతుల గొడవ.. ఉరేసుకుని భార్య ఆత్మహత్య..

Published : Mar 24, 2022, 07:53 AM ISTUpdated : Mar 24, 2022, 07:57 AM IST
బాత్రూంకి వెళ్లి నీళ్లు పోయని భర్త.. దంపతుల గొడవ.. ఉరేసుకుని భార్య ఆత్మహత్య..

సారాంశం

ఎంత చిన్న విషయాలకు ప్రాణాల్ని తృణప్రాయాలుగా చేసుకుంటున్నారో చెప్పే ఉదాహరణే ఈ ఘటన.. బాత్రూంకి వెళ్లివచ్చి భర్త సరిగా నీళ్లు పోయలేదనే దగ్గర దంపతుల మధ్య చెలరేగిన గొడవ చివరికి ఆ ఇల్లాలి ప్రాణాలు తీసింది. 

మూసాపేట :  ఇళ్లలో తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు చాలా చిన్న చిన్న విషయాలకే జరుగుతుంటాయి. తడి Towel మంచం మీదే వదిలేశాడని, బాత్రూంలో water సరిగా కొట్టలేదని..Lights, fans కట్టేయలేదని.. ఇలా మగాళ్లు చాలా కామన్ గా మర్చిపోయే విషయాల మీదే తరచూ చిర్రుబుర్రులు ఉంటుంటాయి. చూడడానికి ఇవి చాలా చిన్న విషయాల్లాగే కనిపిస్తాయి. కానీ ప్రతీ భార్య రోజూ ఎదుర్కునే చికాకే ఇది. ముఖ్యంగా బాత్రూం వాడుకున్న తరువాత ఫ్లష్ నొక్కడం మర్చిపోతారు. అది ఎంత చికాకో ఊహించినా అర్థమవుతుంది. దీంతో గొడవలూ మామూలే.. అయితే ఇంత చిన్న విషయానికి రగిలిన గొడవ ఓHousewife ఉసురు తీసేవరకు వెళ్లడం అనేది మామూలు కాదు. అలాగే జరిగింది హైదరాబాద్ లోని మూసాపేటలో...

బాత్రూం శుభ్రం చేయడం విషయంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం గృహిణి బలవన్మరణానికి దారితీసింది. కూకట్ పల్లి ఎస్ఎస్ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్ పల్లి బాలాజీ నగర్ లో దాసరి  శృతి (28), నవీన్ దంపతులు. ఉమ్మడి కుటుంబంతో ఉంటున్నారు. వీరికి ఆరేళ్లు, ఏడాదిన్నర వయస్సున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.శృతి గృహిణి… నవీన్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. మంగళవారం మధ్యాహ్నం బాత్రూంలో మూత్ర విసర్జన చేసి వచ్చాడు. నీళ్లు పోయడం మర్చిపోయాడు. 

అయితే, నీళ్లు  ఎందుకు పోయలేదు అనే విషయమై శృతి భర్తను నిలదీయడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అది కాస్తా చిలికి, చిలికి గాలివానలా మారింది. తాను చేసింది కరెక్ట్ కాదు అని ఒప్పుకోకపోగా శృతి మీద గట్టి గట్టిగా కేకలు వేశాడు నవీన్.. దీంతో అవమానంగా భావించిన అక్కడినుంచి వెళ్లిపోయింది. శృతి నేరుగా పై గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుని మరణించింది. ఈ హాఠాత్ పరిణామానికి ఇంట్లో వాళ్లు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి శృతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి.. భర్త మీద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి ఘటనే నిరుడు నవంబర్ లో బీహార్ లో చోటు చేసుకుంది. కోడి కూర వండ లేదన్న కోపంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రాణాల మీదికి తీసుకువచ్చింది.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.  పోలీసుల కథనం ప్రకారం.. బేతియా నగరానికి చెందిన Rahul Kumar (26)కు  పక్క గ్రామం pahadpur లో నివసించే  నాగేంద్ర సింగ్ కుమార్తె ఆర్తి దేవి (19) తో 8 నెలల క్రితం వివాహం జరిగింది.

ఆర్తి దేవికి చిన్నప్పటి నుంచి శాకాహారి. కానీ  రాహుల్ కుమార్ మాంసాహారం అంటే చాలా ఇష్టం. వీరిద్దరికీ వివాహమైన తర్వాత ఆర్తి దేవి మాంసాహారం వండడానికి భర్తతో తరచుగా గొడవ పడేది.  తాను తినక పోయినా భర్త సంతోషం కోసం అప్పుడప్పుడు Chicken వండేది.  ఇదే క్రమంలో రాహుల్ కుమార్ నవంబర్ 15న ఇంటికి  చికెన్ తీసుకొచ్చి భార్యను వండమన్నాడు. ఆ రోజు Ekadashi కావడంతో ఆర్తి మాంసాహారాన్ని ముట్టుకోను అని చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ మొదలైంది.  

చివరికి రాహుల్కు ఇంటి బయట వరండాలో తానే చికెన్ వండడం మొదలుపెట్టాడు.  ఇది గమనించిన ఆర్తి..  భర్త రాహుల్ చాలా పెద్ద తప్పు చేశాడని…  ఏకాదశి రోజు అలా చేయడం ఇంటికి అరిష్టం అని భావించి, ఒంటిపై Kerosene పోసుకుని నిప్పంటించుకుంది.  దీంతో తీవ్ర గాయాలపాలైంది.  ఇది గమనించిన రాహుల్ వెంటనే మంటలను ఆర్పి, ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 16న ఆర్తి ప్రాణాలు వదిలింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డియర్ పేరెంట్స్.. 'సామాన్లు' కామెంట్స్ కాదు సమస్య.. మీ పిల్లలకు అసలు సమస్య ఇదే..!
IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త