మద్యం మత్తులో.. కారుతో 9 బైక్ లను ఢీకొట్టిన యువకుడు..

Published : Mar 24, 2022, 07:13 AM IST
మద్యం మత్తులో.. కారుతో 9 బైక్ లను ఢీకొట్టిన యువకుడు..

సారాంశం

తాగింది తలకెక్కితే ఏమీ కనిపించదు. ఏం చేస్తున్నామో విచక్షణ ఉండదు. అలా ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. కారుతో 9 బైకులను గుద్దుుంటూ వెళ్లిపోయాడు.

జగిత్యాల : మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. Jagtial District కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఓ కారు బుధవారం బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో మోహన్ అనే యువకుడు కారు నడపడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 
Divider ను ఢీ కొట్టిన కారు... parking చేసిన వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మార్చి 21న కృష్ణా జిల్లాలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. కృష్ణా జిల్లాలో నూజివీడులో మద్యం మత్తులో బస్సును నడుపుతున్న డ్రైవర్ ను ప్రయాణికులు పోలీసులకు పట్టించారు. ఫూటుగా మద్యం సేవించి తన ప్రాణాలనే కాదు ప్రయాణికుల ప్రాణాలను రిస్క్ లో పెట్టి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ప్రయాణికుల సమాచారంతో పోలీసులు అడ్డుకున్నారు.  ప్రయాణికులను ఎక్కించుకుని సోమవారం ఉదయం విస్సన్నపేట నుండి హైదరాబాద్ కు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. 

అయితే అప్పటికే ఫుల్లుగా తాగేసివున్న డ్రైవర్ తూలుతూనే అత్యంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయసాగాడు. ఇది గమనించిన ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ అదే బస్సులో ప్రయాణిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో నూజివీడు పట్టణంలో పోలీసులు బస్సును ఆపి సదరు డ్రైవర్ కు పరీక్ష చేయగా మద్యం సేవించినట్లు నిర్దారణ అయ్యింది. దీంతో సదరు డ్రైవర్ తో పాటు బస్సును కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రాకతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. 

ఇలాంటి ఘటనే హైదరాబాద్ మేడ్చల్ లో ఫిబ్రవరిలో జరిగింది. మద్యం మత్తులో ఓ మహిళపై దాడిచేశాడో వ్యక్తి. Medchalలో మద్యం మత్తులో జొన్నరొట్టెలు చేసుకుంటున్న మహిళను పొడిచి చంపాడో దుండగుడు.. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. Jagadgiri Gutta షిరిడీ హిల్స్ కు చెందిన కవిత (35) తన ఇంటిముందే జొన్న రొట్టెలు చేసి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. Gas supplier అయిన యాదగిరి ఆల్విన్ కాలనీలో ఉంటున్నాడు. గ్యాస్ సప్లయిర్ అయిన యాదగిరి ఆల్విన్ కాలనీలో ఉంటున్నాడు. 

జొన్నరొట్టెలు చేస్తున్న సమయంలో కవిత వద్దకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న యాదగిరి ఆమెతో వాదనకు దిగాడు. అనంతరం మత్తులో కవిత మెడ, కడుపు భాగంలో knifeతో పొడిచాడు. స్థానికులు గమనించి వెంటనే స్థానిక అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కవిత మృతి చెందింది. పారిపోవడానికి యత్నించిన యాదగిరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. జగద్దిరిగుట్ట పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

డియర్ పేరెంట్స్.. 'సామాన్లు' కామెంట్స్ కాదు సమస్య.. మీ పిల్లలకు అసలు సమస్య ఇదే..!
IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త