హైదరాబాద్ లో ఆత్మకూరు ఘటన.. ! వేధింపులు తాళలేక భర్త కళ్లెదుటే విషం తాగిన భార్య.. !! ఆపకపోగా.....

By AN TeluguFirst Published Sep 24, 2021, 4:57 PM IST
Highlights

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎం.పహాడీలో ఈ దారుణం చోటు చేసుకుంది. మద్యానికి అలవాటు పడిన భర్త సాజీద్ వేధింపులు తాళలేక భార్య షబానా బేగం అనే వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో భర్త కళ్లెదుటే.. భార్య ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య (suicide)చేసుకున్న ఘటన.. ఇంకా మరువక ముందే.. తెలంగాణ లోని హైదరాబాద్ లోనూ అలాంటి ఘటనే జరిగింది. హృదయవిదారకమైన ఈ ఘటనలో కూడా భర్త పాశవికంగా ప్రవర్తించాడు. భార్య పురుగుల మందు(poison) తాగి తన ముందే గిల గిలా కొట్టుకుంటుంటే చోధ్యం చూసినట్టు చూసాడే.. కానీ కాపాడే ప్రయత్నం చేయలేదు. 

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎం.పహాడీలో ఈ దారుణం చోటు చేసుకుంది. మద్యానికి అలవాటు పడిన భర్త సాజీద్ వేధింపులు తాళలేక భార్య షబానా బేగం అనే వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

కాగా, ఆ వివాహిత భర్త కళ్లెదుటే తాను విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాను, నువ్వు ఇక నుంచి ప్రశాంతంగా ఉండు.. అంటూ భర్తతో చెప్పి పురుగుల మందు తాగింది. అయితే, భార్యను కాపాడాల్సింది పోయి.. సాజిద్ పైశాచికంగా ప్రవర్తించాడు. తన ముందే భార్య విషయం తాగి గిల గిలా కొట్టుకుంటున్నా ఆస్పత్రికి తీసుకుని వెళ్లకుండా ఆలస్యం చేశాడు.

దీంతో పాపం.. ఆ అభాగ్యురాలు ప్రాణాలు విడిచింది. షబానా ఆకస్మిక మృతితో ఆమె ఐదుగురు పిల్లలు అనాథలుగా మారారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసు మీద దర్యాప్తు చేపట్టారు. 

దారుణం: భార్య ప్రాణం తీసుకుంటుంటే.. ఆపకపోగా, సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన భర్త

కాగా, గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది. భర్త ఎదుటే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది భార్య. ఉరి వేసుకుంటూ వుంటుంటే ఆపాల్సిందిపోయి వీడియో తీశాడు ఆమె భర్త. విషయం తెలుసుకున్న పోలీసులు భర్త పెంచలయ్యను అరెస్ట్ చేశారు. బెదిరిస్తున్నాడని అనుకున్నాడో లేక  నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలని ఉరుకున్నాడో తెలియదు గానీ.. కళ్లెదుటే భార్య ప్రాణాలు తీసుకుంటున్నా పట్టించుకోలేదు. 

పైగా ఆమెను ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించాడు పెంచలయ్య. ఉరేసుకుంటున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెంచలయన్యను అరెస్ట్ చేశారు. మృతురాలిని ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్న కొండమ్మగా గుర్తించారు. అటు పెంచలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మెప్మా సిబ్బంది ఆందోళనకు దిగారు. 

click me!