Telangana Assembly session: రసమయి, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ

By narsimha lodeFirst Published Sep 24, 2021, 4:25 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ లాబాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది. .గొంతు మూగబోయిందని జగ్గారెడ్డి రసమయి బాలకిషన్ ను ప్రశ్నించారు. అవసరాన్ని బట్టి తన గొంతు బయటకు వస్తోందని జగ్గారెడ్డితో రసమయి చెప్పారు.


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (telangana Assembly session) లాబీల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,(Rasamayi balakishan)  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy)మధ్య  ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.  అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత జగ్గారెడ్డి, రసమయి బాలకిషన్ ల మధ్య  చర్చ ఈ సంభాషణ చోటు చేసుకొంది.

రసమయి గొంతు మూగబోయిందని జగ్గారెడ్డి  రసమయి బాలకిషన్ తో అన్నారు. ఈ వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు రసమయి బాలకిషన్. అవసరాన్ని బట్టి బయటకు వస్తుందని రసమయి  బాలకిషన్ స్పష్టం చేశారు. తన పాట తెలంగాణ అమరవీరులకు, త్యాగాల పునాదులకు అంకింతమని రసమయి వ్యాఖ్యానించారు.రసమయి బాలకిషన్ ను తెలంగాణ సాంస్కృతిక సారధిగా  రసమయి బాలకిసన్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే ఉత్తర్వులు జారీ చేసింది. మరో మూడేళ్ల పాటు రసమయి బాలకిషన్ సాంస్కృతిక సారధిగా కొనసాగనున్నారు.
 

click me!