అసెంబ్లీ అంటే కుస్తీ పోటీలకు వేదిక కాదు.. త్వరలో రూల్ బుక్‌ను సమీక్షిస్తాం: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Sep 24, 2021, 04:52 PM ISTUpdated : Sep 24, 2021, 04:53 PM IST
అసెంబ్లీ అంటే కుస్తీ పోటీలకు వేదిక కాదు.. త్వరలో రూల్ బుక్‌ను సమీక్షిస్తాం: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

సారాంశం

శాసనసభ రూల్ బుక్‌ను సమీక్షించాల్సిన అవసరం వుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ కుస్తీ పోటీలకు వేదిక కాదని.. ప్రజా సమస్యలకు అర్థవంతమైన చర్చలకు వేదిక అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. శాసనసభ్యులకు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్‌తో పాటు శాసనసభలో నియమ నిబంధనలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసనసభ రూల్ బుక్‌ను సమీక్షించాల్సిన అవసరం వుందన్నారు. అసెంబ్లీ కుస్తీ పోటీలకు వేదిక కాదని.. ప్రజా సమస్యలకు అర్థవంతమైన చర్చలకు వేదిక అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రతిపక్షాలు సూచించే సబ్జెక్టులను పరిగణనలోనికి తీసుకోవాలని ఆయన సూచించారు.

శాసనసభ్యులకు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పార్లమెంట్‌లో మాదిరి అసెంబ్లీలోనూ కానిస్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. శాసనసభ్యులకు త్వరలో ఢిల్లీ పర్యటన ఏర్పాటు చేస్తామన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చను పరిశీలిస్తామని.. వీలైనన్ని ఎక్కువ రోజులు సభను నడపాలని కేసీఆర్ కోరారు. 

ALso Read:సభ్యులు కోరినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు: బీఏసీ మీటింగ్‌లో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ  బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. సభ్యులు చర్చకు ఇచ్చే అంశాలను బట్టి సభ్యులు కోరినన్ని రోజులు సమావేశాలు  నిర్వహించాలని ఆయన అన్నారు. కరోనా అదుపులోనే వుండటంతో సభను ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయించారు. ప్రతిరోజూ ప్రశ్నోత్తరాల సమయం వుండాలని, జీరో అవర్‌లో సభ్యులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు కేసీఆర్. ప్రభుత్వం తరపున ఐటీ, పరిశ్రమలు, హరితహారం అంశాలపై చర్చిస్తామన్నారు. బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సీఎం సూచించారు. సభ్యుల సంఖ్య తక్కువగా వున్నా .. విపక్షాలకు సమయం ఎక్కువగానే ఇస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో కొత్తగా కొన్ని నిబంధనలను, విధివిధానాలను రూపొందించుకుని దేశానికి ఆదర్శంగా నిలవాలని సీఎం కోరారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?