ఒంటికి నిప్పంటించుకుని భార్య ఆత్మహత్య.. ఎనిమిదేళ్ల తరువాత భర్తకు తొమ్మిదేళ్ల జైలుశిక్ష..

By SumaBala Bukka  |  First Published Jan 4, 2022, 10:58 AM IST

ఫలక్ నుమా గుల్షన్ మాస్క్ కు చెందిన సయ్యద్ ఫయాజ్ (32), షాహిదా బేగం భార్యాభర్తలు. మద్యానికి బానిసై భర్త తరచూ వేధించేవాడు. జీవితంమీద విరక్తి చెందిన భార్య షాహిదా బేగం 2013లో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు భర్త మీద 489ఎ, 306 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. 


హైదరాబాద్ : భర్త వేధింపులను తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో భర్తకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష పడింది. ఫలక్ నుమా గుల్షన్ మాస్క్ కు చెందిన సయ్యద్ ఫయాజ్ (32), షాహిదా బేగం భార్యాభర్తలు. మద్యానికి బానిసై భర్త తరచూ వేధించేవాడు.

జీవితంమీద విరక్తి చెందిన భార్య షాహిదా బేగం 2013లో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు భర్త మీద 489ఎ, 306 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. శైలజా వాదనలు వినిపించడంతో 7 అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి డి. శ్రీనివాస్ సయ్యద్ ఫయాజ్ కు 9యేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించిందని ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ ఆర్.దేవేందర్ తెలిపారు. 

Latest Videos

కరీంనగర్ జైలులో బండి సంజయ్‌ను పరామర్శించనున్న కిషన్‌ రెడ్డి..

ఇదిలా ఉండగా, జనవరి 3న తమిళనాడులో ఇలాంటి ఘోరమే జరిగింది. Online games వ్యసనం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. సరదాగా మొదలై వ్యసనంగా మారి...అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల నిండు జీవితాలు మొదలు కాకుండానే ఆగిపోయేలా చేశాయి. ఏ పనీ చేయకుండా, గేమ్ లకు బానిసై, అప్పులపాలై.. భార్య, పిల్లలు ఉసురు తీశాడో వ్యసనపరుడు. ఈ విషాద ఘటన Tamil Naduలో కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే...

ఆన్లైన్ గేమ్ లకు బానిసై పనికి వెళ్లకుండా, అప్పుల పాలైన ఓ వ్యక్తి… భార్య, ఇద్దరు పిల్లలను Murderచేసి Suicideకు పాల్పడ్డారు. ఈ ఘటన చెన్నైలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పెరుంగుడి పెరియార్ లోని ఓ అపార్ట్మెంట్లో మణికంఠన్  (36), తార(35)  దంపతులు నివసిస్తున్నారు.  వీరి కుమారులు  ధరణ్ (10),  దహాన్ (1)  ఉన్నారు. 

Omicron effect : నుమాయిష్ మూసివేత.. మళ్లీ ఎప్పుడంటే...

కోయంబత్తూర్ కు చెందిన మణికంఠన్ ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. రెండు నెలలుగా పనికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆన్లైన్ లో నగదు పెట్టి గేమ్ లు ఆడుతూ అప్పుల పాలయ్యాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. డిసెంబర్ 31న రాత్రి ఘర్షణ కూడా పడ్డారు. ఈ క్రమంలో భార్య, ఇద్దరు పిల్లలను చంపి మణికంఠన్ ఆత్మహత్య  చేసుకున్నాడు.

ఇంటి తలుపులు మూసి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అనుమానంతో ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. 

click me!