Omicron effect : నుమాయిష్ మూసివేత.. మళ్లీ ఎప్పుడంటే...

By SumaBala Bukka  |  First Published Jan 4, 2022, 10:19 AM IST

దేశం నలుమూలలా కరోనా నిబంధనలు పాటించాలని, గుంపులు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎగ్జిబిషన్ కు బ్రేక్ పడింది. 2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ కు కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేశారు. కొన్ని రోజులుగా నగరంతో పాటు రాష్ట్రం నలుమూలలా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. 


హైదరాబాద్ : Corona, Omicron కారణంగా Nampally Exhibition ను తాత్కాలికంగా మూసివేశారు. జనవరి 1వ తేదీన గవర్నర్ Numaish ఎగ్జిబిషన్ ను ప్రారంభించగా ఆదివారం రాత్రి పోలీస్ శాఖ అదికారుల ఆదేశాలతో ఎగ్జిబిసన్ సొసైటీ ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్టాళ్ల యజమానులకు తెలిపారు. 

దేశం నలుమూలలా కరోనా నిబంధనలు పాటించాలని, గుంపులు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎగ్జిబిషన్ కు బ్రేక్ పడింది. 2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ కు కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేశారు. కొన్ని రోజులుగా నగరంతో పాటు రాష్ట్రం నలుమూలలా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. 

Latest Videos

undefined

CM KCR: భయపడొద్దు కానీ, జాగ్రత్త ఉండండి.. క‌రోనా వ్యాప్తిపై సుధీర్ఘ స‌మీక్ష‌

ఇదిలా ఉండగా, తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో సీఎం KCR ప్రగతిభవన్ లో Medical and Health Officers‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ‌లో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిపై  సుదీర్ఘంగా చర్చించారు. ఒమిక్రాన్ వ్యాప్తి ప‌ట్ల‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ, అజాగ్రత్త ప‌నికి రాద‌నీ, అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ప్రజలంతా తప్పనిసరిగా Maskలు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు.

ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంద‌ని స్పష్టం చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో Lock down విధించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ స‌మావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. మౌలిక వసతుల క‌ల్ప‌న‌పై పటిష్ట పరచాలని,  బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను సమకూర్చుకోవాలని సూచించారు.

ఒమిక్రాన్ ఎఫెక్ట్:ఈ నెల 8 నుండి 16 వరకు తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు

ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మొత్తం బెడ్లల్లో దాదాపు 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా  మార్చామ‌ని, మిగిలిన ఒక శాతం బెడ్ల‌ను కూడా ఆక్సిజన్ బెడ్లుగా మార్చాల‌ని సూచించారు. గతంలో తెలంగాణ‌లో కేవలం 140 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మాత్రమే ఉన్నా..  ఆక్సిజన్ ఉత్పత్తిని ఇప్పుడు 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగామ‌ని, ప్ర‌స్తుతం ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

అలాగే.. హోం ఐసోలేషన్ చికిత్స కిట్లను సిద్దం చేయాల‌ని, ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని సీఎం కేసీఆర్ అధికారుల‌కు ఆదేశించారు. అన్ని  ఆసుపత్రుల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని, ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఖాళీలు 15 రోజుల్లో భర్తీ చేయాల‌ని ఆ మేర‌కు కార్యచ‌రణ రూపొందించాలని ఆదేశించారు.

click me!