ప్రేమించిపెళ్లి చేసుకున్నాడు..వారానికే వద్దన్నాడు.. తట్టుకోలేక ఆ వధువు చేసిన పని..

Published : Aug 05, 2021, 02:46 PM IST
ప్రేమించిపెళ్లి చేసుకున్నాడు..వారానికే వద్దన్నాడు.. తట్టుకోలేక ఆ వధువు చేసిన పని..

సారాంశం

శృతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి వారం క్రితం పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. కొత్తగూడెంలోని రుద్రంపూర్ లో ఓ గది అద్దెకు తీసుకుని ఇద్దరూ ఉంటున్నారు. 

ఇల్లెందు : ప్రేమించిన వ్యక్తితో పెళ్లయిందనే సంతోషం కూడా తీరకుండానే ఓ నవవధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వరుడి తల్లిదండ్రులు, బంధువులు వధువు మీద దాడిచేసి తల్లివద్దకు పంపించారు. పోలీసులు కౌన్సెలింగ్ చేసినా వారు వినకపోవడంతో ఇక తనకు న్యాయం జరగదని భావించిన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. 

ఈ ఘటన ఇల్లెందులో బుధవారం చోటు చేసుకుంది. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన మద్దెబోయిన సత్యవతికి మగదిక్కు లేదు. 22 యేళ్ల కుమార్తె శృతితో కలిసి ఇల్లెందు పాత బస్టాండ్ ఏరియాలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. శృతి కూడా పట్టణంలోని ఓ స్వీట్ షాప్ లో పనిచేస్తోంది. 

ఈ క్రమంలో స్టేషన్ బస్తీకి చెందిన 23 యేళ్ల మేకల దినేష్ తో పరిచయం ఏర్పడింది. అతడు శృతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి వారం క్రితం పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. కొత్తగూడెంలోని రుద్రంపూర్ లో ఓ గది అద్దెకు తీసుకుని ఇద్దరూ ఉంటున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న దినేష్ కుటుంబసభ్యులు కొత్తగూడెంలోనే ఉంటున్న శఋతి సోదరిని, దినేష్ స్నేహితులను బెదిరించి అడ్రస్ తెలుసుకున్నారు. ఇద్దరినీ పట్టుకుని శృతిపై దాడి చేసి, తల్లి సత్యవతి వద్దకు పంపి, దినేష్ ను తమ వెంట తీసుకెళ్లారు. దీంతో శృతి రెండు రోజుల క్రితం ఇల్లెందు పోలీసులను ఆశ్రయించింది. 
 

PREV
click me!

Recommended Stories

Kavitha Pressmeet: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత కౌంటర్| Asianet News Telugu
KTR Comments: మేము తిడితే మీ జేజమ్మలకు దిమ్మ తిరుగుద్ది: కేటిఆర్ సెటైర్లు | Asianet News Telugu