వాసాలమర్రి వాసులకు గుడ్‌న్యూస్: తెలంగాణ దళితబంధు కింద నిధులు మంజూరు

By narsimha lodeFirst Published Aug 5, 2021, 1:17 PM IST
Highlights


వాసాలమర్రి గ్రామానికి చెందిన దళితబంథు పథకం కింద రూ. 7.60 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ గ్రామాన్ని సీఎం కేసీఆర్  దత్తత తీసుకొన్నారు. నిన్న ఈ గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటించారు.

భువనగిరి: వాసాలమర్రి గ్రామానికి దళితబంధు పథకం కింద రూ. 7.60 కోట్లను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. బుధవారం నాడు కేసీఆర్ ఈ గ్రామంలో పర్యటించారు. వాసాలమర్రిలోని దళితవాడలో మూడు గంటలపాటు ఆయన పర్యటించారు. దళితబంధు పథకం గురించి తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఇంటికి రూ. 10 లక్షలు ఇస్తే ఏం చేస్తారని ఆయన దళిత కుటుంబాలను కేసీఆర్ ప్రశ్నించారు.

దళితబంధు పథకం కింద నిధులు మంజూరు చేస్తామమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ వాసాలమర్రి గ్రామానికి రూ. 7.60 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.తెలంగాణ దళితబంధు పథకంగా పేరు పెట్టినట్టుగా ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది.వాసాలమర్రి గ్రామంలోని 76 కుటుంబాలకు దళితబంధుపథకం కింద నిధులను అందించనున్నారు.ఈ పథకాన్ని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా  చేపట్టాలని ప్రభుత్వం తలపెట్టింది.ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామంలో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

click me!