తననుంచి విడిగా ఉంటోందని.. నడివీధిలో భార్యను రాడ్డుతో మోది దారుణ హత్య.. ఓ భర్త ఘాతుకం..

By SumaBala BukkaFirst Published Feb 4, 2023, 7:57 AM IST
Highlights

భార్య తనను విడిచిపెట్టి వెళ్లి విడిగా ఉంటోందని కోపం పెంచుకున్న భర్త.. ఆమె మీద నడిరోడ్డు లో రాడ్డుతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మెహదీపట్నంలో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త వేధింపులు భరించలేక ఓ భార్య వేరుగా ఉంటుంది.దీంతో అది అవమానంగా భావించిన భర్త ఆమెను నడివీధిలో దారుణంగా హత్యచేశాడు.  శుక్రవారం ఈ ఘటన హైదరాబాదులోని లంగర్ హౌస్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కరీనా బేగం(30) లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో ఉండేది. ఆమెకు  ఏడేళ్ల క్రితం టోలిచౌకి హకీంపేటకు చెందిన మహమ్మద్ యూసుఫ్(36) తో వివాహమయ్యింది.

వీరికి 5,3,2 యేళ్ల వయసున్న ముగ్గురు చిన్నారులు సంతానం. పెళ్లయిన కొద్దికాలం వీరి సంసారం సాఫీగానే సాగింది. ఆ తర్వాత భర్త వేధింపులు మొదలయ్యాయి. అవి రోజు రోజుకు ఎక్కువయ్యాయి. కానీ ముగ్గురు పిల్లలు కావడంతో వారి కోసం భర్త వేధింపులను భరిస్తూ ఓపికగా ఉంది. ఏడాదిన్నర క్రితం ఇక ఓపిక నశించి.. భర్త నుంచి విడిగా పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. లంగర్ హౌస్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది. అలా తనను తాను పోషించుకుంటూ పిల్లలను చదివించుకుంటుంది.

గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు: కేసీఆర్ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

ఇది యూసుఫ్ కు విపరీతంగా కోపాన్ని తెప్పించింది. ఇంటికి రమ్మని చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో యూసుఫ్ భార్య మీద అక్కసు పెంచుకున్నాడు. దీంతో ఆమెను చంపేయాలనుకున్నాడు. నాలుగైదు రోజులపాటు ఆమె కదలికలపై నిఘా పెట్టాడు. ఆ తర్వాత కరీనా బేగం స్కూలుకు వెళ్లేందుకు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఇంట్లోంచి బయటికి వచ్చింది. కొద్ది దూరం వెళ్ళిన వెంటనే ఆమె ముందు భర్త ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆమెతో ఏదో మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ.. ఆమె వెంట నడిచాడు.

అనుమానంతో భార్యను చంపి, పట్టుబడకుండా ఉండాలని గుంతతవ్వి పూడ్చి.. సమాధిమీద మొక్కలు పెంచిన భర్త.. చివరికి..

ఆ తర్వాత ఆమె తనను పూర్తిగా నమ్మింది అనుకున్నాక తనతో పాటు తెచ్చుకున్న రాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. ఈ అనుకోని పరిణామానికి తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదంతా గమనిస్తున్న స్థానికులు వారి దగ్గరికి చేరుకునేసరికి ఆమె మృతి చెందింది. భార్యను చంపిన తర్వాత అక్కడినుంచి నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. ఈ మేరకు లంగర్ హౌస్ పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు.  దీనిమీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ కేస్ శ్రీనివాస్  చెప్పుకొచ్చారు.

click me!