తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు:కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్

By narsimha lode  |  First Published Feb 3, 2023, 8:13 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో  రైల్వే ప్రాజెక్టులకు  భారీగా నిధులు కేటాయించినట్టుగా  కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ  వైష్ణవ్  చెప్పారు.


హైదరాబాద్:  తెలుగు రాష్ట్రాల్లో  రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించినట్టుగా  కేంద్ర రైల్వే శాఖ మంత్రి  ఆశ్వనీ వైష్ణవ్  చెప్పారు.శుక్రవారం నాడు  న్యూఢిల్లీలో  కేంద్ర మంత్రి  మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో  రైల్వే  ప్రాజెక్టులకు  రూ.8,406 కోట్లు కేటాయించిన విషయాన్ని కేంద్ర మంత్రి  చెప్పారు.  తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు  రూ, 4,418 కోట్లు బడ్జెట్ లో కేటాయింపులుజరిగిన విషయాన్ని కేంద్ర మంత్రి వివరించారు.  గతంతో  పోలిస్తే  ఈసారి రికార్డుస్థాయిలో కేటాయింపులు  పెరిగాయని  కేంద్ర మంత్రి  తెలిపారు. గత బడ్జెట్  కంటే  తెలంగాణకు  ఈ దఫా  45 శాతం  పెంచిన విషయాన్ని  కేంద్ర మంత్రి వివరించారు.  

కాజీపేట రైల్వే కోచ్  ఫ్యాక్టరీ  సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సి ఉందని ఆయన  చెప్పారు.  దేశంలో కోచ్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయన్నారు.   కాజీపేటలో  రైల్వే వ్యాగన్  ఫ్యాక్టరీ నిర్మాణానికి టెండర్లు  ఆహ్వానించినట్టుగా  కేంద్ర మంత్రి  తెలిపారు. త్వరలోనే  ఈ పనులను ప్రారంభించనున్నట్టుగా  కేంద్ర మంత్రి తెలిపారు.   తెలంగాణలో  ఎంఎంటీఎస్ రెండో దశ  పనులకు  రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని  ఆయన  ఆరోపించారు.  తెలంగాణలో  ఎంఎంటీఎస్ కి రూ.600 కోట్లు కేటాయించింది  కేంద్రం. హైద్రాబాద్ లో  డబ్లింగ్, త్రిబ్లింగ్  పనులకు  రూ. 600 కోట్లు. కేటాయించినట్టుగా  మంత్రి తెలిపారు.  

Latest Videos

click me!