వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను చంపించి.. మిస్సింగ్ అని ఫిర్యాదు.. ముగ్గురి అరెస్ట్..

Published : Feb 17, 2022, 08:11 AM ISTUpdated : Feb 17, 2022, 08:14 AM IST
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను చంపించి.. మిస్సింగ్ అని ఫిర్యాదు.. ముగ్గురి అరెస్ట్..

సారాంశం

అక్రమసంబంధాలు పచ్చటి కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. భార్య భర్తను.. భర్త భార్యను హత్య చేయిస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అలా పటాన్ చెరులో ఓ భార్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను.. ప్రియుడితో కలిసి హత్య చేయించింది.. 

పటాన్  చెరు :  Extramarital affairనికి అడ్డుపడుతున్నాడని భార్యే మరో ఇద్దరితో కలిసి భర్తను murder చేయించింది. తరువాత ఏమీ తెలియనట్లు పోలీస్స్టేషన్లో భర్త missing అంటూ ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన అమీన్పూర్ పోలీసులు ముగ్గురిని arrest చేసి రిమాండ్కు తరలించారు. డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  ఈనెల 10న అమీన్పూర్ కాలనీలో ఓ వ్యక్తి deadbody లభ్యమైంది. అతని చేతిపై ఉన్న పచ్చబొట్టు, అదే సమయంలో చందానగర్ లో తన భర్త కనిపించడం లేదంటూ మహిళ చేసిన ఫిర్యాదుల ఆధారంగా.. అతనిని వెంకటప్ప (39)గా గుర్తించారు. 

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గికి చెందిన వెంకటప్ప చందానగర్ శివారు గంగారంలో భార్య పద్మ (27), ఇద్దరు పిల్లలతో ఉంటూ  కూలిపని చేస్తున్నాడు. పద్మకు పక్కనే నివసించే సెంట్రింగ్ పని  చేసుకునే అబ్దుల్ రెహమాన్ (35) తో పరిచయంతో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్యతో రెహమాన్ ఉండడం చూసిన వెంకటప్ప గొడవపడ్డాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని అతడిని హత్య చేయించేందుకు రెహమాన్ తో కలిసి కుట్ర పన్నింది. అబ్దుల్ తనతో సెంట్రింగ్ పని చేసే సుభాష్ (30)తో కలిసి ఈ నెల 8న చందానగర్ అడ్డా వద్ద ఉన్న వెంకటప్ప వద్దకు వెళ్లి పని ఉందని చెప్పాడు.

అక్కడినుంచి ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై  కొల్లూరు వెళ్లారు. అక్కడ పని లేదని ఆలూరు వెళ్లి  వెంకటప్ప, సుభాష్ మద్యం తాగారు. అక్కడి నుంచి  అమీన్పూర్ chakrapuri కాలనీలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి  బాగా తాగించి బండరాయితో వెంకటప్ప, తల ముఖంపై కొట్టి హత్యచేసి పరారయ్యారు. పోలీసులు చందానగర్ లో అడ్డా వద్ద  సీసీ ఫుటేజీ,  భార్య కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్యకేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. కేసును త్వరగా చేధించిన సీఐ శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఇతర సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.

ఇదిలా ఉండగా, జనవరి 31న నిర్మల్ లో ఇలాంటి ఘటనే జరిగింది. తన మెడలో తాళి కట్టి మరో మహిళతో extramarital affair ఏర్పరచుకున్న భర్తను.. భార్య supari gangతో murder చేయించిన ఉదంతమిది. నిర్మల్ డిఎస్పి ఉపేందర్రెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుచానూరు ప్రాంతానికి చెందిన కంచర్ల శ్రీనివాస్ (42) అనాధ. ఉపాధి కోసం hyderabad కు వచ్చాడు. తొలుత auto నడిపేవాడు. ఆ క్రమంలో ఉప్పల్ ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేసే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన స్వప్నతో పరిచయం ఏర్పడింది.  

ఇద్దరూ ఇష్టపడి ప్రేమించుకుని.. వివాహం చేసుకున్నారు. స్వప్నకు ఇదివరకే వివాహమై ఒక కుమారుడు (రాజకుమార్) జన్మించాక.. విడాకులు తీసుకుంది. శ్రీనివాస్, స్వప్న దంపతులకు వివాహం తరువాత ఒక కుమారుడు (తరుణ్),  కుమార్తె జన్మించారు. ఆ తరువాత స్నేహితుల సాయంతో real estate వ్యాపారంలోకి శ్రీనివాస్ అడుగుపెట్టాడు.

ఉప్పల్,  వేంపేట్ లలో ఇల్లు నిర్మించాడు. ఈ క్రమంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఆమెతోపాటు కలిసి ఉందాం అంటూ తరచూ భార్యను వేధించసాగాడు.  ఆ వేధింపులు భరించలేక అతన్ని చంపేస్తే సమస్య పరిష్కారం అవుతుందని స్వప్న భావించింది. ఇటీవల కుటుంబ సభ్యులు వేంపేటకు వచ్చారు.  ఇదే అదనుగా భావించిన స్వప్న  తరుణ్, రాజ్ కుమార్ లతో పాటు  నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన తన అక్క కుమారుడు  పోశెట్టిలతో కలిసి శ్రీనివాస్ ను చంపాలనుకున్నట్లు చెప్పింది. 

సుపారీ గ్యాంగ్ తో చేయిద్దామని పోశెట్టి తన తమ్ముడు చిక్కా అలియాస్ ప్రవీణ్ కుమార్ ను వేంపేటకు పిలిపించాడు. ఈ నెల 22న రాత్రి మెదక్, జగిత్యాల జిల్లాలకు చెందిన బాణాల అనిల్,  కంచర్ల మహావీర్, మ్యాతరి మధు, కొలనూరు సునీల్, పొన్నం శ్రీకాంత్,  పూసల రాజేందర్ లతో 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నిద్రపోతున్న శ్రీనివాస్ ను రోకలిబండతో దాడి చేసి హత్య చేశారు. మృతుడి ఒంటిపై ఉన్న ఒక బంగారు ఆభరణాలు లాక్కుని వారు వెళ్లిపోయారు. 

నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలం సమీపంలోని మృతదేహాన్నిపోశెట్టి, రాజ్ కుమార్, చిక్కా లు  పడేశారు. ఈ కేసును ఛేదించిన లక్ష్మణ్ చందా పోలీసులు మొత్తం పదమూడు మందిని నిందితులుగా గుర్తించారు. పది మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు డిఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 73 గ్రాముల బంగారు ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన రోకలిబండ తదితర  వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu