మేడారం జాతర‌లో అప‌శృతి.. జంపన్న వాగులో పడి రిటైర్డ్ ఉద్యోగి మృతి

Published : Feb 17, 2022, 05:48 AM IST
మేడారం జాతర‌లో అప‌శృతి.. జంపన్న వాగులో పడి రిటైర్డ్ ఉద్యోగి మృతి

సారాంశం

మేడారం జాతరలో బుధవారం అపశృతి జరిగింది. జంపన్న వాగులో స్నానం చేసి దర్శనం చేసుకోవాలని  భావించిన ఓ రిటైర్డ్ ఉద్యోగి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. వాగులో స్నానం చేస్తున్న క్రమంలో బ్రిడ్జి గుంతల్లో పడిపోవడంతో ఆయన చనిపోయారు. 

మేడారం (medaram)లో స‌మ్మ‌క, సారక్క (samakka, sarakka)జాతర ఘనంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి భ‌క్తుల రాక‌తో మేడారం కిక్కిరిసిపోతోంది. అయితే ఈ జాత‌రలో బుధ‌వారం అపశృతి చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు అని జంప‌న్న వాగులోకి వెళ్లిన సింగ‌రేణి రిటైర్డ్ ఉద్యోగి.. ఆ వాగులో ప‌డి మృతి చెందాడు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.  భ‌ద్రాద్రి కొత్త‌గూడెం (badradri kothagudem) జిల్లా ఇల్లెందు మండ‌లం తిల‌క్ న‌గ‌ర్ (tilaknagar)కు చెందిన శాద న‌ర్స‌య్య (63) (shada narsaiah)  సింగ‌రేణి (singareni)లో ఉద్యోగం చేసి రిటైర్డ్ (retired) అయ్యారు. మేడారం జాతర జ‌రుగుతున్న నేపథ్యంలో ఆ జాత‌ర‌కు వెళ్లాల‌ని అనుకున్నారు. అయితే బుధ‌వారం కుటుంబ స‌భ్యులు అంతా క‌లిసి జాత‌ర‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలో శాద న‌ర్స‌య్య జంప‌న్న వాగులో స్నానం చేద్దామ‌నుకున్నాడు. స్నానం కోసం అని వాగులోకి వెళ్లిన ఆయ‌న ఉన్న‌ట్టుండి బ్యాలెన్స్ త‌ప్పి బ్రిడ్డి కింద ఉన్న గుంత‌ల్లో ప‌డిపోయాడు. దీనిని గ‌మ‌నించిన‌ కుమారుడు అశోక్ (ashok) తండ్రిని వెంట‌నే బ‌య‌ట‌కు తీశాడు. స‌మీపంలోని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లాడు. కానీ హాస్పిట‌ల్ కు వెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది. ఆయ‌న అప్ప‌టికే మృతి చెందాడ‌నే చేదు వార్త‌ను డాక్ట‌ర్లు కుమారుడికి చెప్పారు. 

తల్లుల ద‌ర్శ‌నం చేసుకోకుండానే..
న‌ర‌స‌య్య కొత్త‌గూడెం ప‌రిధిలోని సింగ‌రేణి గ‌నిలో ప‌ని చేశారు. 2019 డిసెంబ‌ర్ నెల‌లో రిటైర్డ్ అయ్యారు. ఆయ‌న‌కు  భార్య సరోజ‌, ఇద్ద‌రు అబ్బాయిలు, ఇద్ద‌రు అమ్మాయిలు ఉన్నారు. వారంద‌రికీ పెళ్లిల్లు అయిపోయాయి. ఫ్యామిలీ మొత్తంతో క‌లిసి స‌మ్మ‌క్క, సార‌క్క జాత‌ర‌కు సంతోషంగా వెళ్లారు. అయితే బుధ‌వారం సార‌క్క‌, గురువారం స‌మ్మ‌క్క ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ ద‌ర్శ‌నానికి ముందే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. మృత‌దేహాన్ని బుధ‌వారం సాయంత్రం ఇంటికి తీసుకువ‌చ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu