తాటిచెట్లకు తాళాలు: కల్లుగీత కార్మికుల వినూత్న ఆలోచన, ఎందుకంటే?

By narsimha lodeFirst Published Feb 3, 2024, 9:48 AM IST
Highlights

 కోతుల బెడద నుండి తప్పించుకొనేందుకు  కల్లుగీత కార్మికులు  వినూత్నంగా ఆలోచించారు.  ఈ ఆలోచన గీతకార్మికులకు ప్రయోజనం కలిగించింది.

వరంగల్: కల్లు గీత కార్మికులు  కోతుల బెడద నుండి తప్పించుకొనేందుకు  వినూత్న రీతిలో ఆలోచించారు.  తాటి చెట్లకు తాళాలు వేసి కోతులకు చెక్ పెట్టారు.  తాటి చెట్లు ఎక్కిన కోతులు కల్లు తాగుతున్నాయి.అయితే కల్లు తాగిన కోతులు ఊరికే ఉంటాయా... కల్లు కోసం  తాటి చెట్టుకు కట్టిన కుండలను పగులగొడుతున్నాయి. అందుకేనేమో అసలే కోతి... ఆపై కల్లుతాగింది... అని తరచుగా వినే ఉంటాం. వరంగల్ జిల్లాలోని కల్లుగీత కార్మికులు కూడ  కోతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీనికి  మంచి ఉపాయం ఆలోచించారు.

 ప్రతి రోజూ ఇదే తంతు సాగుతుంది. దీంతో కల్లుగీత కార్మికులు  తాటిచెట్లకు కూడ తాళాలు వేస్తున్నారు. కోతుల బెడద నుండి తప్పించుకొనేందుకు  గీత కార్మికుల ఆలోచన మంచి ఫలితాన్ని ఇచ్చింది. తాళాలు వేసిన తాటి చెట్ల జోలికి కోతులు రావడం లేదు.

also read:ఫోటోకు యత్నించిన ఇద్దరిని వెంటాడిన ఏనుగు: ప్రాణభయంతో పరుగులు (వీడియో)

తాటిచెట్లకు  కల్లు గీసేందుకు  కుండల స్థానంలో ప్లాస్టిక్ బాటిళ్లు ఉపయోగిస్తున్నారు.  ఈ ప్లాస్టిక్ బాటిల్స్ చుట్టూ ఇనుప రేకును చుట్టి దానికి తాళం వేస్తున్నారు. ఇనుప రేకుకు మేకుల మాదిరిగా తయారు చేయించారు. దీంతో  ఈ ఇనుప రేకులను కోతులు దాటే సాహసం చేయవు. ఒకవేళ అలా సాహసం చేస్తే   కోతులు గాయాల పాలు కానున్నాయి.

ఉమ్మడి వరంగ్ జిల్లాలోని రాయపర్తి మండలం రాగన్నగూడెంలో    ప్లాస్టిక్ బాటిళ్లు కట్టి తాటిచెట్లకు తాళాలు వేస్తున్నారు  కల్లుగీత కార్మికులు. తాటిచెట్లకు తాళం వేసిన తర్వాత కోతులు రావడం లేదని గీత కార్మికులు  చెబుతున్నారు. 

also read:రంగారెడ్డి జిల్లా రైతు అదృష్టం:లక్కీ డ్రాలో కిలో బంగారం

రాష్ట్రంలోని పలు గ్రామాల్లో  కోతుల బెడద కారణంగా ప్రజలు  తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. కోతుల నుండి తప్పించుకొనే క్రమంలో  మరణించిన ఘటనలు కూడ  నమోదయ్యాయి.  మరికొన్ని ఘటనల్లో  కోతుల దాడుల్లో  గాయపడిన  సందర్భాలు కూడ లేకపోలేదు.

అడవులు అంతరించిపోవడంతో  ఆహారం కోసం కోతులు  గ్రామాల వైపునకు వస్తున్నట్టుగా అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న అడవి విస్తీర్ణం తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.  అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల  వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
 

click me!