సడెన్ గా కరెంట్ పోతోందా? పనులన్నీ ఆగిపోతున్నాయా? ఇలా చేస్తే ఈ కష్టాలనుంచి బయటపడొచ్చు...

By SumaBala Bukka  |  First Published Feb 3, 2024, 9:20 AM IST

మీటర్లకు లింక్ చేసిన మొబైల్ ఫోన్ కు సమాచారం నేరుగా వస్తుంది. కరెంట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు  మెయింటెనెన్స్ కోసం తీసేస్తారు, కరెంట్ బిల్లులు లాంటి సమాచారం అంతా తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.  


హైదరాబాద్ : తరచుగా కరెంటు పోవడం.. ముఖ్యమైన పనులు ఆగిపోవడం.. ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాల సమయాల్లో పవర్ కట్, ముఖ్యమైన మీటింగ్ జరుగుతున్నప్పుడు  ఒకసారిగా కరెంటు పోవడం…ఇటీవల కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం కావడంతో ఇది ఐటీ, తదితర రంగాల ఉద్యోగస్తులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. 

అయితే, దీనికి చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు ఓ సూచన చేసింది. కరెంటు పోయే విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే ఆ సమయానికి చేసుకోవాల్సిన పనులు.. ముందే చేసుకోవడం, లేదంటే వాయిదా వేసుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చని  తెలిపింది.

Latest Videos

మల్లారెడ్డిని బర్రె కరిచిందనుకుంటా.. బీఆర్ఎస్ శకం ముగిసింది - బండ్ల గణేష్

దీనికోసం.. విద్యుత్ శాఖ నేరుగా వినియోగదారుడి ఫోనుకే సమాచారాన్ని అందించే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే ఇది అందుబాటులో ఉన్నప్పటికీ..  చాలామంది వినియోగదారులు సమాచారం సరైన సమయానికి అందడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ తాజాగా  ఓ సమాచారాన్ని పంచుకుంది. ఇలా నేరుగా విద్యుత్ సరఫరాకు సంబంధించి లేదా కరెంటు బిల్లుకు సంబంధించిన సమాచారం అందుకోవడం కోసం… వినియోగదారులు తమ ఫోన్ నెంబర్ ను సంబంధిత మీటర్లకు అనుసంధానం చేసుకోవాలని చెబుతున్నారు.

మీటర్లకు లింక్ చేసిన మొబైల్ ఫోన్ కు సమాచారం నేరుగా వస్తుంది. కరెంట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు  మెయింటెనెన్స్ కోసం తీసేస్తారు, కరెంట్ బిల్లులు లాంటి సమాచారం అంతా తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.  దీనికోసం వినియోగదారులు tssouthernpower.com వెబ్సైట్లో తమ ఫోన్ నెంబర్ను లింక్ చేసుకోవాలని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు.

ఒకవేళ,  వెబ్సైట్లో నెంబర్ ను అప్డేట్ చేయడం తెలియకపోయినట్లయితే మీటర్ రీడింగ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు.. వారికి సంబంధిత ఫోన్ నెంబర్ ఇచ్చినా.. ఈ సౌకర్యం అందుబాటులోకి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిని వినియోగదారులు ఉపయోగించుకుని కరెంటు ఇబ్బందుల నుంచి బయటపడాలని చెబుతున్నారు.

click me!