పెద్దపల్లి కలెక్టర్ బదలీకి కారణాలివేనా!

Published : May 03, 2017, 05:42 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
పెద్దపల్లి కలెక్టర్ బదలీకి కారణాలివేనా!

సారాంశం

బొంపల్లి దళిత వ్యక్తిపై పోలీసుల దాడి మీద ఎస్‌సి ఎస్‌టి కమిషన్, మానవహక్కుల సంఘం, డిజిపికి లేఖ రాయడంతో వర్షణి మొదట పోలీసుల అసంతృప్తి కి గురయ్యారు. ఇసుక అక్రమ రవాణను కఠినంగా వ్యవహరించి రూలింగ్ పార్టీ నేతల ఆగ్రహానికి  కూడా గురయ్యారు. బదిలీ కాక ఏమవుతుంది?

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలగు వర్షిణి మీద  ఉన్నట్లుండి వేటు పడింది.

 

మరొకరని నియమించకుండా నే ఆమెను బది లీ చేశారు. పోస్టింగు కూడా ఇవ్వ లేదు. అందుకే ఆమె బదిలీమీద అనుమానాలు మొదలయ్యాయి.

 

కలెక్టర్లుగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తయ్యాయో లేదోొ  వర్షిణి ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది.

 

ఆమె తీసుకుంటున్న అనేక చర్యలు అధికార పార్టీనేతలకు ఇబ్బందిగా మారాయని అందుకే అమెను కొనసాగించడం మంచిది కాదని బదిలీచేసినట్లు విమర్శ వినిపడుతూ ఉంది.

 

 దానికి తోడు ఆమె నిక్కచ్చితన పోలీసులకు కూడా నచ్చడం లేదు. ప్రస్తుతం తెలంగాణాలో పోలీసుకుల చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగ తి తెలిసిందే.

 

బొంపల్లి దళిత వ్యక్తిపై పోలీసుల దాడి మీద ఎస్‌సి ఎస్‌టి కమిషన్, మానవహక్కుల సంఘం, డిజిపికి లేఖ రాయడంతో వర్షణి మొదట పోలీసుల అసంతృప్తి కి గురయ్యారు.

 

పోలీసులకు అసంతృప్తి కలిగితే ఇంకే ముంది. రూలింగ్ పార్టీ నేతల అసంతృప్తి కూడా దీనికి తోడయింది. దీనికి కారణం ఇసుక అక్రమ రవాణను కఠినంగా వ్యవహరించడం.

 

 అందుకే మరొకరెవరినీ నియమించకుండ ఆగమేఘాలమీద ఆమెను బదిలీ చేశారు. పోస్టింగ్ కూడా ఇవ్వ కుండా వెయిటింగ్‌లో పెట్టారు.  బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ కావడంతో, జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రభాకర్ రెడ్డికి పదవీ బాధ్యతలు అప్పగించి వెళ్లిపోయారు.

 

ఈ మధ్య బీఫ్ గురించి  బహిరంగంగా మాట్లాడి వివాదాస్పదమయిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళీ  మీద కూడ తొందర్లో వేటు పడనుందని వినిపిస్తూ ఉంది. ఎవరివో మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయనపై సిఎం, ప్రధాన కార్యదర్శికి విపరీతంగా ఫిర్యాదులు  వెళ్లాయి.

 

వరంగల్ అర్బన్ కలెక్టర్ కాట్ర ఆమ్రపాలి కూడా హిట్ లిస్టులో ఉందని సమాచారం.

 

రూలింగ్ పార్టీ నేతలకు చెప్పకుండా తనిఖీలకు వెళ్ళడం అక్కడి టిఆర్‌ఎస్ పెద్దలకు  మింగుడు పడడం లేదు. ఆమధ్య వరంగల్లో వరదలువచ్చాక నాలాలపై మీద ఉన్న  ఆక్రమణలను ఆమె తొలగించారు. ఒత్తిడులు వచ్చినప్పటికీ విన్పించు కోకుండాతన పని పూర్తి చేశారు.

 

మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్‌లు కలెక్టర్ పద్దతి నచ్చ లేదని పై వారికి ఫిర్యాదుచేసినట్లు  అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

మహబూబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా కూడా స్థానికి నాయకుల అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. ‘ కొత్త జిల్లాలు ఏర్పడినపుడు  హడావిడి కలెక్టర్లను నియమించడం జరిగింది. ఇపుడు అనేక ముఖ్యమయిన పథకాలు అమలులోకి వస్తున్నందున, పాలనా సౌకర్యం పేరుతో ఈ కలెక్టర్ల నియమాకం పకడ్బందీగా చేస్తాం,’ అని వీరందరిన ఉన్న స్థానాలనుంచి లేపేస్తారని జోరుగు వినబడుతూ ఉంది.

PREV
click me!

Recommended Stories

Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu
Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu