సాహిత్య అకాడమీ చైర్మన్ గా నందినీ సిధారెడ్డి

Published : May 02, 2017, 02:49 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
సాహిత్య అకాడమీ చైర్మన్ గా నందినీ సిధారెడ్డి

సారాంశం

మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

ప్రముఖ కవి, రచయిత నందినీ సిధారెడ్డి ని ప్రభుత్వం రాష్ర్ట సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, సాహిత్య అకాడమీ చైర్మన్ గా తనను నియమించడంపై  సిధారెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 
 


మెదక్ జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించిన సిధారెడ్డి బందారం,వెల్కటూర్, సిద్ధిపేటలలో చదువుకున్నారు. ఉస్మానియా వర్సిటీలో ఎం.ఏ. చేశారు.

'ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు' అనే అంశంపై ఎం.ఫిల్‌ పట్టా పొందాడు.

 


సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసి 2012లో పదవీవిరమణ చేశాడు.

 

మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

 

సోయి అనే సాహిత్య పత్రికను కూడా నడిపారు. 2001లో తెలంగాణా రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు.

తెలంగాణపై ఆయన రాసిన నాగేటి చాల్లల్ల నా తెలంగాణ అనే పాట సుప్రసిద్ధమైంది.

"పోరు తెలంగాణ" సినిమాలో ఈ పాటను వాడుకున్నారు.

PREV
click me!

Recommended Stories

KTR Counter to Uttam Kumar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు| Asianet News Telugu
Top 5 Government Schemes : రైతులకు నేరుగా డబ్బులు.. ఈ ఐదు పథకాలేవో మీకు తెలుసా?