మున్సిపల్ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు నామ మాత్రంగానే పోటీ చేస్తున్నారు. చాలా స్థానాల్లో పోటీకి దూరంగా ఉన్నాయి.
హైదరాబాద్: తెలంగాణలో వామపక్ష పార్టీల పరిస్థితి రోజు రోజుకు బలహీన పడుతున్నట్లు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో వామపక్ష పార్టీల తరపున పోటీచేసిన అభ్యర్థుల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
also read:మున్సిపల్ పోల్స్: కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు సవాల్
undefined
Also read:మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తాం: జనసేన, బీజేపీ పొత్తుపై కేటీఆర్ ఇలా..
రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కొన్ని నియోజకవర్గాల్లో వామపక్ష పార్టీలకు బలమైన నాయకత్వం తో పాటు క్యాడర్ ఉండేది. క్రమక్రమంగా ఆ ప్రాంతాల్లో లెఫ్ట్ పార్టీలు పట్టు కోల్పోతుండడంతో ఆ పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి ప్రస్తుతం వచ్చింది.
Also read:కారుకు ప్రమాదం: కొలిక్కి రాని జూపల్లి, హర్షవర్ధన్ వివాదం
Also read:తగ్గని జూపల్లి కృష్ణారావు: టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు చిక్కులు
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం అన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు గా గుర్తింపు పొందిన కాంగ్రెస్,బిజెపి, తెలుగుదేశం లాంటి పార్టీలకు అన్ని మున్సిపాలిటీలు అభ్యర్థులు దొరకకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also read:మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?
Also read:మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...
లెఫ్ట్ పార్టీలకు స్థిరమైన ఓటుబ్యాంకు కలిగి ఉన్నా క్షేత్రస్థాయిలో అనుబంధ సంఘాలు, నాయకత్వం పనిచేస్తున్నా... స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వామపక్ష పార్టీలు పెద్దగా దృష్టి పెటెందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్ల లో ఒక్క మహబూబాబాద్ మున్సిపాలిటీలో మాత్రమే సిపిఐ అభ్యర్థులు బరిలో నిలిచారు.
రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలో సగటున ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువగా లెఫ్ట్ పార్టీల నుంచి రంగంలో అభ్యర్థులు లేరని తేలుస్తోంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వామపక్ష పార్టీ లు ఎన్నికల్లో ప్రభావాన్ని పెద్దగా చూపించ లేక పోతున్నాయి. ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీలకు పెద్దగా ప్రాతినిధ్యం కూడా దక్కడం లేదు.
ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కూడా వామపక్ష పార్టీలు నామ మాత్రానికే పరిమితమయ్యాయి. ఉత్తరర తెలంగాణ జిల్లాలోని కరీంనగర్, వరంగల్ జిల్లాలతోపాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వామపక్ష పార్టీల ప్రభావం గతంలో ఎక్కువగా ఉండేది.