మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?

By narsimha lodeFirst Published Jan 10, 2020, 5:33 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి లో మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్ లో జోష్ పెరుగుతుంది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి లో మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్ లో జోష్ పెరుగుతుంది. ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీలో ఉన్న నేతలు మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నించాల్సి వస్తుంది. 

Also read: మున్సిపల్ పోల్స్‌కు కాంగ్రెస్ మేనిఫెస్టో: ఓటర్లకు బంపర్ ఆఫర్స్

మాజీ ఎంపీ కవితకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనుచరులున్నారు.  తెలంగాణ జాగృతి సంస్థ సభ్యులున్నారు. వీరంతా స్థానిక పోరులో  టికెట్లు ఇచ్చారు.

టిఆర్ఎస్ పార్టీకి అనుబంధం కాకపోయినా మాజీ ఎంపీ కవిత నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి సభ్యులు, కార్యకర్తలు  గులాబీ పార్టీ టికెట్ దక్కించుకునేందుకు కవిత పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం ఉంది.

Also read:మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...

ఉద్యమ సమయంలో జాగృతి తరపున చేసిన కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమంలో జాగృతి పాత్ర తదితర అంశాలను బేరీజు వేసుకుంటూ టికెట్ వచ్చేలా చూడాలని మాజీ ఎంపీ కవితపై నేతలు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారనే ప్రచారం సాగుతోంది. 

 కానీ పరిస్థితులు పార్టీలో పరిస్థితులు అందుకు భిన్నంగా  ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అన్ని ఎమ్మెల్యేలకే  అప్పగించడంతో కవిత అనుచరులుగా గుర్తింపు దక్కిన నేతలకు, జాగృతి సభ్యులకు  టికెట్లు దక్కకుండా పోయాయి.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితులు నెలకొన్నాయని కార్యకర్తలు  వాపోతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా  కవిత అనుచరులకు ఇదే అనుభవం ఎదురౌతుందన్న ప్రచారం ఉంది.

ఎమ్మెల్యేలంతా తమ అనుచరులకు టికెట్లు కేటాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు ఆశించిన జాగృతి కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కలేదని వాపోతున్నారు. ఈ విషయంలో కార్యకర్తలకు నచ్చ చెప్పలేక పార్టీ నిబంధనలు ఉల్లంఘించలేక ఎంపీ కవిత విదేశాలకు వెళ్ళారని ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల సమయంలో కార్యకర్తలకు దూరంగా ఉండాలన్న అభిప్రాయంతో కవిత విదేశాలకు వెళ్లిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కవిత అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయ అవకాశాలను కొంత మంది పరిశీలిస్తున్నారు.

మాజీ ఎంపీ కవిత విదేశాలకు వెళ్లడం ఇప్పుడు అధికార పార్టీ లో హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి కూతురే తన అనుచరులకు టికెట్లు దక్కించుకోలేదన్న ప్రచారం మొదలైంది.
 

click me!