మున్సిపల్ పోల్స్‌కు కాంగ్రెస్ మేనిఫెస్టో: ఓటర్లకు బంపర్ ఆఫర్స్

narsimha lode   | Asianet News
Published : Jan 10, 2020, 03:23 PM ISTUpdated : Jan 10, 2020, 05:40 PM IST
మున్సిపల్ పోల్స్‌కు కాంగ్రెస్ మేనిఫెస్టో:  ఓటర్లకు బంపర్ ఆఫర్స్

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు మేనిఫెస్టోను సిద్దం చేస్తోంది. ప్రజలకు పలు రకాలైన వాగ్దానాలను ఇవ్వనుంది. 

హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ బారీ మేనిఫెస్టోను సిద్ధం చేస్తుంది. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామనే హామీలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వనున్న హామీల జాబితాను సిద్ధం చేస్తోంది.

 మేనిఫెస్టోను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ.రంగారెడ్డి అద్వర్యంలో ఓ కమిటీ నియమించింది. ఈ కమిటీ అన్ని వర్గాల అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది.ముసాయిదా మ్యానిఫెస్టోను రెడీ చేసుకొని కమిటీ పీసీసీ ఆమోదం తర్వాత  పార్టీ పరంగా ఇవ్వనున్న హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. 

పేదలకు 150 గజాల ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణం కోసం 9 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వాలని భావిస్తోంది. ప్రతి మున్సిపల్ పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తామని కూడ హామీ ఇచ్చింది.

మున్సిపాలిటీల్లో ఇంటర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఉచిత రవాణా  సౌకర్యాన్ని కల్పించే విధంగా హమీలు కురిపించనుంది.  పాఠశాల విద్యార్థుల ఫీజుల నియంత్రిస్తామని హామీ ఇవ్వనుంది.
 
పురపాలక పట్టణాల్లో తరచూ ఎదురయ్యే రోడ్లు , డ్రైనేజీ,ఎల్ఈడి లైట్ ల ఏర్పాటుకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా హామీలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 
మున్సిపల్ పట్టణాల్లో 750 స్క్వేర్ ఫీట్స్ అంతకంటే తక్కువగా ఉండే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపుతో పాటు ఉచితంగా నల్లా కనెక్షన్‌ను కూడ ఇస్తామని కూడ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది.

Also read:మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...
 
మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం  కాంగ్రెస్ పార్టీ తమ ముసాయిదా మేనిఫెస్టోలో ఏర్పాటు చేసిన అంశాల అంశాలపై త్వరలో పిసిసి తుది నిర్ణయం తీసుకోనుంది.

పీసీసీ సూచనల మేరకు మరికొన్ని అంశాలు కూడా మేనిఫెస్టోలో చేర్చే  అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది 


 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu