బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించిదని, కానీ ఇప్పుడు ఎందుకు సీబీఐ విచారణ కోరటం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ తన వైఖరిని ఎందుకు మార్చుకుందని మురళీధర్ రావు ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, విద్యుత్ రంగం, ప్రభుత్వ భూ ఆక్రమణలు, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దానిపై ఎందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించారు.
హైజాగ్ కు గురైన భారతీయులున్న నౌక.. సోమాలియా తీరంలో ఘటన.. రంగంలోకి ఐఎన్ఎస్ చెన్నై
తెలంగాణ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ తన వైఖరిని ఎందుకు మార్చుకుందని మురళీధర్ రావు అన్నారు. కాంగ్రెస్ తన రాజకీయ ఎజెండా కోసం బీఆర్ఎస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఈ అక్రమాలను ఆయుధంగా వాడుకుంటోందా ? అని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం, విద్యుత్ రంగం తదితర అంశాల్లో అనేక అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. మరి ఇప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. జరిగిన అవకతవకలపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అయ్యో.. దేశంలో అత్యంత వృద్ధ ఎలుగుబంటి ‘బబ్లూ’ మృతి.
జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రతిష్ఠా కార్యక్రమంపై ‘ఇండియా’ కూటమి నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మురళీధర్ రావు ఆరోపించారు. ఆ కూటమి నాయకులు హిందువులను కించపరుస్తూ హిందూ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. ఈ నేతలు భారత వ్యతిరేక శక్తులకు రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. వారు తమ రెచ్చగొట్టే ప్రకటనలతో దేశ శాంతికి విఘాతం కలిగిస్తున్నారని చెప్పారు. ఆ కూటమి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకత్వం మౌనం వహిస్తోందని తెలిపారు.