యాదాద్రి ఆలయ హుండీకి రికార్డు స్థాయిలో విరాళాలు వచ్చాయి. గత 28 రోజుల్లో రూ. 3.15 కోట్ల విరాళాలు వచ్చాయి. పది తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలూ వచ్చాయి. విదేశీ కరెన్సీ రూపాల్లోనూ విరాళాలు రావడం గమనార్హం.
Yadadri: యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఆలయ హుండీ ఆదాయం భారీగా పెరిగింది. సరికొత్త రికార్డును నమోదు చేసింది. సాధారణ రోజుల్లోనూ పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. సాధారణ రోజులైన గత 28 రోజుల్లో రూ. 3.15 కోట్ల ఆదాయం వచ్చింది.
యాదాద్రి టెంపుల్ హుండీ ఆదాయం గత సాధారణ 28 రోజుల్లో రూ. 3.15 కోట్లకు పెరిగింది. ఇది ఆలయ చరిత్రలోనే అత్యంత గరిష్టం. హాలీడే సీజన్‌లో ఈ ఆలయానికి రోజుకు 60 వేల నుంచి 70 వేల మంది భక్తులు వస్తుంటారు. అదే సాధారణ రోజుల్లో 10 వేల నుంచి 20 వేల మంది వరకు భక్తులు వస్తారు. చివరి 28 రోజుల్లో రూ. 3.15 కోట్ల విరాళాలు ఆలయ హుండీకి వచ్చాయి.
Also Read: Sonia Gandhi: ఖమ్మం నుంచి లోక్ సభ బరిలో సోనియా గాంధీ.. సౌత్ మిషన్‌లో భాగమేనా?
ఆలయ ఈవో రామక్రిష్ణ రావు మాట్లాడుతూ.. హుండీకి మొత్తం రూ. 3,15,05,035 నగదు విరాళంగా వచ్చాయి. 100 గ్రాముల బంగారం, 4.250 కిలోల వెండి ఆభరణాలు వచ్చాయి. అలాగే.. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, యూఏఈ, బ్రిటన్, సౌదీ అరేబియా, ఒమన్, మలేషియా, నేపాల్, ఖతర్, థాయ్‌లాండ్, న్యూజిలాండ్ దేశాల కరెన్సీ కూడా విరాళంగా వచ్చాయి. గతంలో ఈ కాలంలో హుండీకి రూ. 2.5 కోట్లు వచ్చాయని, కానీ, ఈ సారి రూ. 3.15 కోట్లు వచ్చినట్టు ఈవో చెప్పారు. ఆలయ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని ఆలయ అధికారులు చెబుతున్నారు.