రియల్ స్టార్... ట్వీట్ స్టార్

Published : Jan 27, 2017, 12:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రియల్ స్టార్... ట్వీట్ స్టార్

సారాంశం

ఆంధ్రా ప్రత్యేక హోదా కోసం అరెస్టైన తెలంగాణ హీరో సంపూర్ణేష్ బాబు కేవలం పబ్లిసిటీ కోసమే అలా చేశాడని కుళ్లు కామెంట్లు పెడుతున్న కొందరు వెర్రి అభిమానులు అసలు తమ హీరో  ఉద్యమం కోసం ఏం చేశాడన్నది వారు తెలుసుకోవాలి. 


సంపూర్ణేష్ బాబును హీరోగా కాదుకదా కనీసం ఓ జూనియర్ ఆర్టిస్టుగా కూడా గుర్తించని సినీ అభిమానులు, ముఖ్యంగా నెట్ లో సంపూ పై కుళ్లు జోకులు పేల్చే వారు ఇప్పుడైనా కళ్లు తెరవాలి. ఆంధ్రుల పోరాటంలో అరెస్టైన తెలంగాణ నటుడిని అక్కున చేర్చుకోమని ఎవరూ వేడుకోవడం లేదు. కానీ, కుళ్లు జోకులు పేల్చి అవమానించకండి.. ఇప్పుడైనా  రీల్ హీరోల కు రియల్ హీరోలకు తేడాని తెలుసుకోండి.  

 

కొందరు రీల్ లో మాత్రమే హీరోలు.. మరికొందరు రియల్ హీరోలు... కొందరు నటులు ట్వీట్లతో మాత్రమే ఉద్యమిస్తారు.. మరికొందరు నటులు ఉద్యమించి అరెస్టవుతారు.. ఎవరి గురించి ఇంత వివరణ అనేది మరీ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా...

 

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రా ప్రజలంతా ఏకమై విశాఖ తీరాన ఉద్యమం చేయడానికి సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. దానికి సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మద్దతిచ్చారు. తెలంగాణకు చెందిన హీరో సంపూర్ణేష్ బాబు ( బహుశా కొంతమందికి అతడిని ఇలా అనడం కూడా నచ్చడం లేదు) కూడా అందులో ఒకరు.


ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయితే ట్వీట్లతో ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అంతేకాదు ఉద్యమానికి ఉత్ర్పేరకంగా ఉండాలని ప్రత్యేకంగా పాటలను రాయించి యూ ట్యూబ్ లో విడుదల చేశారు. నేను సైతం అంటూ ఆంధ్రా హోదా కోసం పాటుపడ్డారు. చలో విశాఖ అంటూ పాటల్లో గర్జించారు.

 

గోపాల గోపాల సినిమాలో నాయకుడంటే నడిపించేవాడు అని డైలాగులు పేల్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం నిజ జీవితంలో ఆ పరిస్థితి వచ్చే సమయానికి సైడ్ అయిపోయారు. కాటమరాయుడు సినిమాలో బీజీ బీజీగా గడిపారు.

 

కానీ, తెలంగాణ కు చెందిన నటుడు సంపూర్ణేష్ బాబు మాత్రం విశాఖపట్నం వచ్చి స్వచ్ఛందంగా అరెస్టు అయ్యారు. అయితే ఇక్కడ కూడా సంపూపై కొందరు నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చి తమ శునకానందాన్ని ప్రదర్శించుకున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే సంపూ ఆంధ్రా ఉద్యమానికి జై కొట్టారని విషం కక్కారు.

 

విశాఖ పట్నంలో హుద్ హుద్ తుపాను వచ్చిన సమయంలోనూ సంపూ తన ఉదారతన చాటుకున్నారు. తన శక్తి మేరకు లక్ష రూపాయిలను ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించారు. అప్పుడు ఇదే మాట వినిపించింది.

 

ఆంధ్రా ప్రత్యేక హోదా కోసం అరెస్టైన తెలంగాణ హీరో సంపూర్ణేష్ బాబు కేవలం పబ్లిసిటీ కోసమే అలా చేశాడని కుళ్లు కామెంట్లు పెడుతున్న కొందరు వెర్రి అభిమానులు అసలు తమ హీరో  ఉద్యమం కోసం ఏం చేశాడన్నది వారు తెలుసుకోవాలి. ప్రాంతం వేరైనా సాటివారికి సాయపడుదాం అనుకున్న నటుడిని అభినందించాల్సిందిపోయి వెకిలి కామెంట్లు చేయడం నిజమైన సినీ అభిమానులనూ బాధిస్తోంది.

 

గోపాల గోపాల సినిమాలో పవన్ ఓ డైలాగ్ అంటాడు.. వేగం బండిలో కాదు మిత్రమా... నడిపించే వాడి నరాల్లో ఉంటుంది అని.. ఉద్యమం కూడా అలాంటిదే అది సోషల్ మీడియాలో పుట్టదు... కడుపు మండిన వాడి గుండెల్లో పుడుతుంది. 

 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం