విభజన విందు...వాయిదానే పసందు

First Published Jan 27, 2017, 9:06 AM IST
Highlights
  • గవర్నర్ చొరవచూపితేనే మాటలు
  • లేదంటే ఎత్తులకు పైఎత్తులు
  • ఇదీ తెలుగు సీఎంల తీరు
  • విభజన సమస్యలపై చొరవే లేదు

 

తెలగు రాష్ట్రాలు విడిపోయి రెండున్నరేళ్లు దాటింది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు అందాల్సిన నిధులు, నెరవేర్చాల్సిన హామీలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారమైనా రెండు రాష్రాల మధ్య విభజించాల్సిన సంస్థలు, ఆస్తుల పంపకం ఒక కొలిక్కి వచ్చిందా అంటే అదీ లేదు.

 

రాష్ట్ర విభజనకు ముందే పదలు సంఖ్యలో విభజన కమిటీలు ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటి వరకు ఫలితం శూన్యం. అన్నదమ్ముల మధ్య ఆస్తిపంపకాల కంటే మరీ ఘోరంగా తయారైంది రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్య.

 

నీటి పంపకాలే కాదు కనీసం కుర్చీల పంకాలపై కూడా ఇంకా పీఠముడే నెలకొంది. చొరవ చూపాల్సిన రెండు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలను పరిష్కారించాల్సింది పోయి దీన్ని కూడా రాజకీయంగా లబ్దిపొందే ఎత్తుగడగా వాడుకుంటున్నారు. విభజన సమస్యల వల్లే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నామని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.

 

గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం రాజభవన్ లో గవర్నర్ నరసిహన్ ఇద్దరు ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. విభజన సమస్యలపై చర్చించుకోవాలని ఇద్దరు సీఎంలకు సూచించారు. అయినా పరిస్థితి షరా మామూలే. గవర్నర్ విందులో తప్ప ఇద్దరు సీఎంలు ఒక చోట కలవడమే అరుదు. ఏదో పెద్దాయన చొరవ తీసుకొని చర్చించుకోమంటే అక్కడ కూడా విభజన సమస్యను మరింత నాన్చే ధోరిణిలోనే ప్రవర్తించారు.

 

హైకోర్టు విభజన పై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తే.. కేసీఆర్ ను ఇరుకునపెట్టే ఉద్దేశంతో పదోషెడ్యూల్‌ సంస్థల విభజనను ప్రస్తావించారట ఏపీ సీఎం చంద్రబాబు. సుప్రీం చెప్పినా విభజన జీవో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.

 

ఇలా గవర్నర్ సమక్షంలో కూడా ఎత్తులు పై ఎత్తులతో ఇద్దరు సీఎంలు తమ రాజకీయ చతురతను ప్రదర్శించారు తప్పితే విభజన సమస్యలను  ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు.
 

click me!