ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కేసీఆర్ ఎక్కడికి వెళ్లనున్నారంటే...

By SumaBala Bukka  |  First Published Dec 15, 2023, 9:47 AM IST

తుంటి ఎముక గాయం నుంచి కోలుకున్న కేసీఆర్ శుక్రవారం ఉదయం యశోదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 


హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 7వ తేదీ అర్థరాత్రి ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాం హౌజ్ లో కాలుజారి పడడంతో తీవ్రంగా అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. దీంతో గత వారం రోజుల క్రితం సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక గాయానికి చికిత్స తీసుకుంటున్నారు. హిప్ రీప్లేస్ మెంట్ ఆపరేషన్ చేయించుకున్నారు. 

గురువారంనాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత కేసీఆర్ నేరుగా బంజారాహిల్స్ లోని నంది నగర్ లో ఉన్న నివాసానికి వెళ్లారు. ఆపరేషన్ నుంచి చాలా వేగంగా కోలుకున్నారు కేసీఆర్. ఎక్కువగా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లోనే సమయాన్ని గడిపే కేసీఆర్ ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లడానికే ఇష్టపడుతున్నారు. కానీ, కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి  6 నుంచి 8 వారాల సమయం పడుతుందని  డాక్టర్లుతెలిపారు. దీంతో ఆయనను నందినగర్ లోని నివాసానికే తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నట్టుగా సమాచారం. 

Latest Videos

undefined

మాజీ సీఎం కేసీఆర్ హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ విజయవంతం.. వైద్యులు ఏం చెప్పారంటే..

కెసిఆర్ ఆస్పత్రి పాలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు,  రాజకీయ నాయకులు, ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.  తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, ఉద్యమ నేతగా అందరికీ అభిమాన పాత్రుడైన కేసీఆర్ ను పరామర్శించేందుకు పార్టీలకు అతీతంగా ఆసుపత్రికి నేతలందరూ వచ్చారు.

తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు కేసీఆర్ ను పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయనను పరామర్శించారు. సినీ హీరోలు చిరంజీవి, నాగార్జునలతో  అనేకమంది సినీ ప్రముఖులు కూడా ఆయనను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. కెసిఆర్ ను చూడడానికి రాష్ట్రం నలువైపుల నుంచి అనేకమంది జనం యశోద ఆసుపత్రికి పోటెత్తుతుండడంతో ఆయన ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశారు.

తాను బాగానే ఉన్నానని కోలుకుంటున్నానని, ఎవరూ ఆందోళన పడవద్దు అని అందులో తెలిపారు. ఇలా పెద్ద సంఖ్యలో తరలి రావడం వల్ల ఆసుపత్రిలోని మిగతా రోగులకు ఇబ్బంది కలుగుతుందని.. తాను ఎక్కువ మందిని కలవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు సూచించారని  తెలిపారు. కోలుకున్న తర్వాత తానే ప్రజల్లోకి వస్తానని.. నేరుగా కలుస్తానని తెలిపారు.

click me!